TTD ఈఓ ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు

Politicalhunter-2.jpg

టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు మరియు పలువురు అధికారులు

టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి ఆకస్మిక మృతి… దశదినకర్మ దిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ హాజరయ్యారు.శనివారం జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో మంత్రి ఆయన స్వగృహానికి వెళ్లి టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డిని మరోసారి కలిసి ఓదార్చారు. ఆకస్మిక మృతికి గురైన చంద్రమౌళి రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మంత్రి నివాళులర్పించారు. అలాగే జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఇసాక్ భాష, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి, వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారుడు తిరుపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యం.టి.కృష్ణ బాబు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తదితరులు కూడ టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డిని కలిసి ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం సంతాప సభ వద్ద చంద్రమౌళి రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top