బనగానపల్లె పట్టణం లోని మండల పరిషత్ భవనం లో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా : బనగానపల్లె మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ మానసవీణ అధ్యక్షతన అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రోడ్లు మరియు భవనములు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరై మండల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది
అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల పాలన లో రాష్ట్రం సర్వ నాశనం మైందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ప్రజా ప్రతినిధులు వేధింపులకు గురై ఎన్నో కష్ట నష్టాలు అనుభవించారని గుర్తు చేశారు గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది గ్రామాల్లో ప్రజల సమస్యలను తీర్చలేని స్థితికి గ్రామ సర్పంచ్ లు ఉండేవారన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ఇకనైనా తమ పద్ధతి మార్చుకోవాలి హెచ్చరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి…
ఏది ఏమైనా గత ప్రభుత్వం ఏం చేసిందో దానికంటే కూడా కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రజలు అందరూ ఎంతో ఆసక్తికరంగా చూస్తూ ఉంటారని అధికారులందరూ ప్రజలకు సౌకర్యాలను అందించడంలో బాధ్యత వహించాలని దిశా నిర్దేశం చేశారు కొంతమంది అధికారులు విధుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం చేస్తూ ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. మేనిఫెస్టో ఇచ్చిన మాట ప్రకారం రేపు 1 తేదీ న పింఛన్దారులకు 3000 బోనస్ తో పాటు పెన్షన్ 4000 అందించడం జరుగుతుందన్నారు..