శ్రీశైలం మహా పుణ్యక్షేత్రానికి చేరుకున్న జగద్గురు పీఠాధిపతి పాదయాత్ర

శ్రీశైల-జగద్గురు.jpg

శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లా ఏడ్యూరు శ్రీ క్షేత్రం నుంచి శ్రీశైలానికి మొదలుపెట్టిన మహా పాదయాత్ర

నంద్యాల జిల్లా ఆత్మకూరు మీదుగా వెంకటాపురం నుండి శ్రీశైల క్షేత్రానికి చేరుకున్న మహా పాదయాత్ర

43రోజులుగా కొనసాగిన 600 కిలోమీటర్ల పాదయాత్ర

డిసెంబర్ 1 నుంచి – జనవరి 10వ తేదీ వరకు జరగనున్న పలు రకాల ధార్మిక కార్యక్రమాలు

జనవరి 11 నుంచి 15 వరకు భారీ ఎత్తున జరిగే రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా సమ్మేళన కార్యక్రమం విజవంతంగా కావాలని చేస్తున్న పాదయాత్ర

సమ్మేళనానికి పాల్గొననున్న రాష్ట్ర నలుమూలల నుంచి వెయ్యి మందికి పైగా పీఠాధిపతులు, మఠాధిపతులు ,పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొంటారని వెల్లడించిన..శ్రీశైల జగద్గురు పీఠాధిపతి – జగద్గురు చిన్న సిద్ధ రామ పండితా రాజ్య శివాచార్య మహా స్వాములు

లోక కళ్యాణ అర్థమై శ్రీశ్రీశ్రీ 1008 డాక్టర్ చిన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామిజి శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్రకు వేల సంవత్సరాల చరిత్రను దృష్టిలో ఉంచుకొని ఎన్నో మంచి సంకల్పాలతో కర్ణాటక బెలగావ్ జిల్లా యాడూర్ శ్రీ క్షేత్రం నుండి శ్రీశైలం వరకు సుమారు 600 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఈ రోజు ఉదయం పాదయాత్ర శ్రీశైలం చేరుకుంది. 600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ఈరోజు ఉదయం శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న చిన్న సిద్ధరామ శివాచార్య పీఠాధిపతి వారికి ఆలయ సాంప్రదాయం అనుసరించి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి సభ్యులు అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న తులసిమాలను వేసి స్వామివారికి ఘనంగా ఆహ్వానం పలికారు. శ్రీశైలం యొక్క కీర్తిని దేశవ్యాప్తం చేయాలని గౌరవనీయ దేశ ప్రధాని నరేంద్ర మోడీని శ్రీశైలం క్షేత్ర దర్శనార్థం రావాలని శ్రీశైలానికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని
నంద్యాల జిల్లా ఆత్మకూరు మీదుగా వెంకటాపురం నుండి శ్రీశైల క్షేత్రానికి చేరుకున్న మహా పాదయాత్ర 43రోజులుగా కొనసాగుతున్న పాదయాత్ర శ్రీశైలం చేరింది డిసెంబర్ 1 నుంచి – జనవరి 10వ తేదీ వరకు పలు రకాల ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయని జనవరి 11 నుంచి 15 వరకు భారీ ఎత్తున జరిగే రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా సమ్మేళన కార్యక్రమాలలో రాష్ట్ర నలుమూలల నుంచి వెయ్యి మందికి పైగా పీఠాధిపతులు, మఠాధిపతులు ,పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొంటారని ఇప్పటికే శ్రీశైల జగద్గురు పీఠాధిపతి – జగద్గురు చిన్న సిద్ధ రామ పండితా రాజ్య శివాచార్య మహా స్వాములు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top