రోడ్డు ప్రమాదాలపై..DSP రామంజి నాయక్

Onroad accidents DSP RamanjiNaik

Onroad accidents DSP RamanjiNaik

రోడ్డు ప్రమాదాలు, నేర నియంత్రణ,CC కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

ఆత్మకూరు DSP రామంజినాయక్

నంద్యాల ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారి ఆదేశాలమేరకు ఈరోజు 09-10-2024వ తేదీ ఆత్మకూరు పట్టణంలోని రెహమత్ నగర్ లో గల M.M. ఫంక్షన్ హాల్ నందు ఆత్మకూరు డిఎస్పి R. రామంజి నాయక్ గారు, ఆత్మకూరు రూరల్ ఇన్స్పెక్టర్ M. సురేష్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ, CC కెమెరాల ప్రాముఖ్యత, నేరాల నియంత్రణ, సైబర్ క్రైమ్ మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది ఆత్మకూరు పట్టణంలోని షాప్ ల యజమానులు, డ్రైవర్లు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిఎస్పి గారు మాట్లాడుతూ పట్టణంలో నేర నియంత్రణలో భాగంగా ప్రాపర్టీ నేరాలు జరగకుండా నివారణ చర్యలలో భాగంగా షాప్ ల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా దొంగతనాలు, ఏదైనా ఇతర సంఘటనలు జరిగినప్పుడు సులువుగా ముద్దాయిలను కనుగొని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు, మరియు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండుటకు షాప్ యజమానులు తమ వస్తువులను రోడ్డుపై ఉంచకుండా మరియు వినియోగదారులు తమ షాపులకు వచ్చినప్పుడు పార్కింగ్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రోడ్డు ప్రమాదాలు చాలావరకు అతివేగం వలన అజాగ్రత్త వలన జరుగుతుంటాయని కావున యువత ఏదైనా వాహనంపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని మరియు వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు మరియు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు.

అతివేగం వలన ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ కుటుంబం నష్టపోవడం మాత్రమే కాకుండా ఎదుటివారి ప్రమాదం జరగడం వలన వారి కుటుంబం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది.

మోటర్ సైకిల్ పై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం వలన ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు అని మరియు అతివేగంగా మోటార్ సైకిల్ పై వెళ్లకూడదని, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు (మైనర్) వాహనాలు ఇవ్వడం వలన వారు ప్రమాదానికి గురి కావడంతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కావున చిన్న పిల్లలకి వాహనం నడిపే అవకాశం ఇవ్వకూడదని కొన్ని సూచనలు తెలియజేశారు.

సెల్ ఫోన్స్ మాట్లాడుతూ డ్రైవింగ్

ఓవర్ లోడుతో ప్రయాణం చేయకూడదని ముఖ్యంగా ఆటోలలో పరిమితికిమించి ప్రయాణం చేయడం వలన ప్రమాదాలు జరగవచ్చునని కావున ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని విజ్ఞప్తి చేశారు. మరియు వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్స్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయని కావున సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి రామంజి నాయక్ గారితో పాటు ఆత్మకూరు రూరల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి గారు ఆత్మకూరు ఎస్సై వెంకటనారాయణ రెడ్డి గారు ప్రజలు పాల్గొన్నారు.

సైబర్ క్రైమ్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు వార్తాపత్రికల ద్వారా, పాఠశాలలో కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మరియు వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు సైబర్ నేరాల నియంతరణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కానీ చాలామంది ప్రజలు అత్యాశకు వెళ్లి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడడం కావున తెలియని వ్యక్తుల వద్ద నుండి వచ్చే ఫోన్ కాల్స్ ,లింక్ లపై అప్రమత్తంగా ఉండాలని, మరియు మీయొక్క బ్యాంకు సంబంధించిన పాస్వర్డ్ ఓ.టి.పి మొదలగునవి ఎవరితోను పంచుకోరాదని, ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో పడి మోసపోతే వెంటనే 1930 కు సమాచారం అందించిన ఎడల బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,నంద్యాల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top