కేంద్ర ప్రభుత్వానిది ఇదేం దమననీతి..? , తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారు..?
బిజెపి ఎంపీలు రాజీనామా చేయాలి , ఏపీ, బీహార్ కు నిధుల వరద..
తెలంగాణా ముఖాన బురదనా.. , కేంద్రం ధమన నీతి సరైంది కాదు..
తెలంగాణ హామీలు నీటి మూటలేనా.. , కరీంనగర్ కు ఒక్క ప్రాజెక్టు తీసుకురాని దద్దమ్మ బండి సంజయ్
ఏపీ, బీహార్ తప్ప మిగతా రాష్ట్రాలను చిన్నచూపు చూడటం బాధాకరం..
తెలంగాణ ఏం తప్పు చేసింది..? బిజెపి ఎంపీలు చెప్పాలి..
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్రావు గారు*
TS కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం ఏపీ బీహార్ కు వరదలాగా నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి బురద చూపారని కరీంనగర్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఒకరకంగా ఇంకో రాష్ట్రానికి ఒక రకంగా ధమన నీతికి పాల్పడడం సరైంది కాదని పేర్కొన్నారు.
అన్ని రాష్ట్రాలకు సమాన రీతిలో బడ్జెట్లో కేటాయింపులు జరపాలని డిమాండ్ చేశారు.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కేటాయింపులపై కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు గారు స్పందించారు.
తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించామని, కానీ దక్కింది శూన్యం అన్నారు .
ఏ ఒక్క ప్రాజెక్టుకు కేటాయింపులు జరపకపోవడం దారుణమని పేర్కొన్నారు.
రూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీ లను గెలిపించినా ఒక్క ప్రాజెక్టుకు కేటాయింపులు జరపలేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది సరైన విధానం కాదని ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
బడ్జెట్లో తెలంగాణా ఊసే లేదు అసలు మొత్తం బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో హామీలను అమలుపర్చలేదన్నారు.
తెలంగాణా హామీలెక్కడ అంటూ అయన ధ్వజమెత్తారు. అసలు వాటి ప్రస్తావనే రాకపోవడం దారుణమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
ములుగు యూనివర్సిటీకి అదనపునిధుల ప్రస్తావన లేదని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు.
కరీంనగర్ రైల్వే లైన్ కు సంబంధించి ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు జరగకపోవడం శోచనీయం. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఈ విషయంలో పట్టింపు లేని తనంతో వ్యవహరించినట్లు స్పష్టం అవుతున్నదని ధ్వజమెత్తారు.
తెలంగాణా ముఖాన బురద
ఏపీకి నిధుల వరద కురిపించి తెలంగాణా ముఖాన బురద కొట్టారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ, బీహార్ తప్ప మిగతా రాష్ట్రాలను చిన్నచూపు చూడటం బాధాకరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం వారి మిత్రపక్షాలను సంతృప్తి పరిచేందుకే ఆ రాష్ట్రాలకు అధికంగా నిధులు కేటాయించిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదన్నారు.
ఇది తెలంగాణ ప్రజలను అవమానకరిం చినట్లే అవుతుందని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు ఎలాంటి బాధ లేదు, సంతోషమే అన్నారు. తెలంగాణకు నిధులు కేటాయించకపోవడమే బాధాకరమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కి మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరం అని, కేంద్రం ధమననీతి కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుందని విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించిన, అడిగిన వాటిని కూడా పట్టించుకోకపోవడం వారి అసమర్ధ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.
తెలంగాణలో 8 స్థానాలను బీజేపీ జాతీయ పార్టీని గెలిపిస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు .
8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గుండు సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు. ఇది ఎంతో దూరంలో లేదు రాబోయే రోజుల్లో ఇది సాధ్యమవుతుందని ధ్వజమెత్తారు.
తెలంగాణకు బడ్జెట్లో తగిన కేటాయింపులు జరిపినందుకు బాధ్యత వహిస్తూ తెలంగాణ బిజెపి ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.