మహిళలు ఇప్పటికే ధివి నుంచి భువి కి అన్ని రంగాలలో అభివృద్ధి చెందారని ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, వారికి తమ అండ దండలు ఎప్పుడూ ఉంటాయని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు.
నంద్యాల జిల్లా , ఆత్మకూరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళాదినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
ముందుగా.. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో మహిళా అధికారులు , నాయకుల తో కలిసి జ్యోతిని వెలిగించి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి వారితో…పంచుకున్నారు.
ఈ సంధర్బంగా ఐదుగురు మహిళా మణులను సన్మానించి పారితోష్కాన్ని అందించారు.
వీరు మహిళలనే బేషాజాలు లేకుండా.. వివిధ రంగాలలో పనిచేస్తూ కుటుంబాన్ని భుజానపైన వేసుకొని ముందుకు నడిపిస్తున్నారని … వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా మహిళలందరూ ఎదగాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కొనియాడారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..
దేశంలోనే మహిళలకు సమాన హక్కులు కల్పించిన ఘనత టిడిపి వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామ రావుదేనని అన్నారు..
ఇల్లు బాగుండాలన్న, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలన్నా.. మహిళలదే కీలక పాత్ర అని అన్నారు…
అనంతరం ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వివిధ రకాల లబ్ధిదారుల నుంచి వినతులను స్వీకరించారు.
On International Women's Day - MLA Buddha