అండర్ పాస్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ..కర్నూలు – గుంటూరు జాతీయ రహదారిపై ఎర్రగూడూరు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామం మీదుగా నేషనల్ హైవే 340 c వెళ్తుంది.. గ్రామం అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు.
హైవే పనులు కూడా 90 భాగాలు పూర్తి అయిపోయాయి.. ఐతే ఇప్పుడు గ్రూపు రాజకీయాలకు ఆ గ్రామం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. పాత అలైన్ మెంట్ లలో అండర్ పాస్ బ్రిజ్జి నిర్మాణం లేదు.
కొందరి రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు అలైన్ మెంట్ ను మార్చి అండర్ పాస్ నిర్మించడానికి పూనుకోవడంతో.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ….గ్రామస్తులు రోడ్డెక్కారు..
నేషనల్ హైవే సేఫ్టీ కమిటీ సూచన ప్రకారం ఎర్రగుడూరు గ్రామంలో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే సర్కిల్ పాయింట్ నుంచి జీరో పాయింట్,..లో పక్కనే ఉన్న తెలుగుగంగ కాలువ బ్రిడ్జి వరకు వస్తుందని.., ఇలా జరుగుతే బ్రిడ్జి పై బారం పడుతుందని.. , అలాగే తెలుగుగంగ పై డౌనల్ కావడంతో.. భారీగా ప్రమాదాలు జరిగి వాహనాలు తెలుగంగలో పడే అవకాశం ఉందని నేషనల్ హైవే సేఫ్టీ సూచించింది.
అందుకని NH అదికారులు గ్రామంలో అండర్ పాస్ లేకుండా సాధారణంగా రోడ్డు వేసేందుకు అలైన్మెంట్ చేశారు. నేషనల్ హైవే సేఫ్టీ కమిటీ సూచనలను కూడా పక్కనపెట్టి.. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం మా గ్రామంలో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి మొగ్గు చూపడం సబబు కాదని ఆందోళన చేపట్టారు. అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించడం వల్ల.. గ్రామంలో అడ్డు గోడలు కట్టి..చాలా ఎత్తులో హైవే రోడ్డు నిర్మిస్తారు.
గ్రామ చివరిలో తూర్పు దిక్కున ఒకచోట అండర్పాస్ నిర్వహిస్తారు. ఆ అండర్పాస్ గుండా అవతల వాళ్ళు , ఇవతలకి ఇవతల వాళ్ళు అవతలికి వెళ్లడానికి ఉంటుంది. అక్కడ తప్ప గ్రామం అంధకారంలోకి వెల్లడమే కాక .. రెండు విడిభాగాలుగా కూడా..విడిపోతుంది.
హైవే హంగులతో.. గ్రామం కలకల లాడుతుందనుకొని సంతోషంగా ఉన్న వారికి ..ఈ అండర్పాస్ వల్ల రెండు భాగాలుగా విభజించబడుతుందని.. వారు ఆవేదన చెందుతున్నారు. అండర్పాస్ నిర్మిస్తే అవతలివాళ్లు ఇవతలికి కనపడరు , ఇవతల వాళ్ళు ..అవతలికి కనపడరు..
ఎత్తులో ఉన్న..ఆ నేషనల్ హైవేపై నిలబడితే.. ఉత్తరాన ఒక ఎర్రగూడూరు..దక్షిణాన ఒక ఎర్రగూడురుగా.. పిలవబడుతుంది. అంటే .. ఎర్ర గూడూరు -1 , ఎర్ర గూడూరు 2.. గా పిలువ బడతాయి.. మా గ్రామ అభివృద్ధిని, అడ్డుకోవద్దని నేషనల్ హైవే అధికారులను , రాజకీయ నాయకులను, గ్రామస్తులు వేడుకుంటుంన్నారు.
కానీ ఇప్పడికే గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరడంతో.. సాధ్యం కాదేమోనన్న భయం వారికి వెంటాడుతుంది. విడవమంటే పాముకు కోపం .. కరవమంటే కప్పకు కోపం అన్నట్టు గ్రూపు రాజకీయాలు తయారయ్యాయి.
ఇరు వర్గాల మధ్య నలుగుతున్న ఎర్రగుడూరు గ్రామం.. LED వెలుగుల వెలుతురులో… హైవే అంగులతో కలకల లాడుతుందో… లేక అండర్ పాస్ నిర్మాణంతో..అంధకారంలోకి వెళ్లి.., రెండుగా విడిపోతుందో .. వేచి చూడాలి ..
#ఎర్రగూడూరులోఅండర్ పాస్ వద్దు #ErraguduruloUndarpass #Nounderpassin Erragudur – concern of villagers