సహజ సిద్ధంగా పెరిగే ఎన్నో మొక్కలలో పలు వ్యాధులను అద్భుతంగా హరించే ఔషధ గుణాలున్నాయి.
ఈ మొక్కల గురించి మనం కనీస పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఆరోగ్య పరిరక్షణతో పాటు వైద్య పరమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతమేరకైనా బయడపడవచ్చు. విలువైన ఔషధ గుణాలున్న నేలములక గురించి ఇపుడు తెలుసుకుందాం. రహదారులు, రైలుపట్టాల పక్కన, నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఒక మీటరు వరకు విస్తంచే బహువార్షిక మొక్క నేల ములక. దీని కాండం గుండ్రంగా గట్టిగా ఉంటుంది. ఆకులు టమాటో పత్రాల్లా ఉంటాయి. కాయలు సన్నటి తెల్లటి చారలతో ఆకుపచ్చగా ఉండి పండినపుడు పసుపురంగులో ఉంటాయి. పలు ప్రాంతాలలో దీన్ని ‘నేలవాకుడు’, ‘తిక్క వంకాయ’, ‘ముళ్ళవంకాయ’ గా పిలుస్తారు. సొలనేసి కుటుంబానికి చెందిన నేలములక శాస్త్రీయనామం సొలానం సురత్తెన్స్. దీనిలోని ఔషధ గుణాలను పరిశీలిద్దాం.
ఎండిన నేలములక్కాయలు మూలికల విక్రయశాలల్లో లభ్యమౌతాయి. నేలములక పండ్లరసం, నువ్వుల నూనె సమంగా కలిపి నూనె మిగిలే వరకు మరగించి చల్లార్చి ఆ నూనెను గాని లేదా ఎండిన నేల ముల క్కాయల చూర్ణంలో కొద్దిగా తేనె కలిపి గాని పైకి పూస్తుంటే పేనుకొరుకుడువ్యాధి హరించి ఆ ప్రాంతంలో తిరిగి వెంట్రుకలు వస్తాయి. రెండు స్పూన్ల నేల ములక చూర్ణాన్ని రెండు గ్లాసుల నీళ్ళలో వేసి అరగ్లాసు నీరు మిగిలేలా మరగించి చల్లార్చి వడగట్టి అందులో కొద్దిగా వేయించిన పిప్పళ్ళ చూర్ణం, ఇంగువ, తేనె, ఉప్పు కలిపి తాగుతున్నా దగ్గు, ఆయాసం తగ్గుతాయి. కళ్ళె తెగిపడిపోతుంది. జీర్ణశక్తి వృద్ధి అవుతుంది.
నేల ములక పండులో సొలెసోనిన్, బీజములలో పీతవర్ణ తైలం, సమూలంగా ఎండించి కాల్చి వేసిన బూడిదలో పొటాషియం నైట్రేట్, కార్బొనేట్, సల్ఫేట్ అనే ఆంశాలున్నట్లు ప్రయోగశాల అధ్యయనాల్లో గుర్తించారు.
Also Read తుంగ (గడ్డలు) ముస్తలతో శరీర దుర్వాసన మాయం
ఎండిన నేల ములక్కాయ విత్తుల్ని నెయ్యితో తడిపి నిప్పులపై వేసి వచ్చే పొగను నోటిలోకి పీల్చుకుని కొద్దిసేపాగి బయటకు వదుల్తుంటే పంటిలోని క్రిములు నశించి పిప్పి పంటి నొప్పి తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఇది -అనుభవేక వైద్యమే. నేల ములక, మిరియాలు, ఉసిరిక చూర్ణాల్ని సమంగా తీసుకుని దుష్టపాకు రసంతో నూరి సెనగలంత మాత్రలు చేసి ఎండించి రోజుకు రెండు, మూడుసార్లు ఒక్కొక్క మాత్ర వంతున తీసుకుంటుంటే వివిధ రకాల దగ్గులు, జలుబు తగ్గుతాయి. జ్వరాలు, కీళ్ళనొప్పులు, అజీర్ణం, చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులకు వాడే ఔషధాల తయారిలో నేల ములకను ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు. నేల ములక కాయల చూర్ణాన్ని అరస్పూను నుంచి స్పూనువరకు ఉ దయం, సాయంత్రం సేవిస్తే మూత్రాశయ రాళ్ళు కరిగిపోవటమే కాకం మూత్రం ధారాళంగా వస్తూ శరీరంలో చేరి దుష్టజలం తగ్గుతుంది.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
ఆయుర్వేద వైద్యంలో.. నేల ములక
నేల ములక్కాయలు, వేయించిన జీలకర్ర, ఉసిరిక చూర్ణాల్ని సమంగా కలిపి రోజుకు రెండుమూడు సార్లు ఒక స్పూను వంతున తేనెతో కలిపి సేవిస్తుంటే ” పలు పదార్థాలు, వాతావరణం, ధూమపానం సరిపడక వచ్చే దగ్గులు తగ్గటమే కాక ఆయా వ్యాధి పీడితులకు ఉబ్బసవ్యాధి వచ్చే అవకాశాలు సన్నగిల్లి, ఉబ్బస తీవ్రత కూడా తగ్గుతుంది. ఊపిరితిత్తుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. ఈ చూర్ణాలకు సమానంగా పచారి కొట్లలో దొరికే అతి మధుర చూర్ణం కూడా కలిపి సేవిస్తుంటే ఊపిరితిత్తుల్లోను, కడుపులోను మంట, నోటి వెంట రక్తం పడటం, పొడిదగ్గు కూడా తగ్గుతాయి. ఆయుర్వేద వైద్యంలో వివిధ వ్యాధులకు వాడే దశమూలాలు అనే పదిరకాల ప్రసిద్ధి చెందిన వేర్లలో నేల ములకకూడా ఒకటి. సుదర్శన చూర్ణం, దశమూల క్వాథచూర్ణం, వాసా కంటకారి లేహ్యం, .. శ్యాసకుఠారం వంటి ఆయుర్వేదౌషధాల తయారీలో నేల ములకను ఉపయోగిస్తారు.