ఆత్మకూరు, అక్టోబరు 5 ; భారతదేశ సమైక్యతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆర్ఎస్ఎస్ ఉమ్మడి కర్నూ లు జిల్లా విభాగ్ ప్రచారక్ సురేంద్ర పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో విజయ దశమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారక్ సురేంద్ర మాట్లాడుతూ వేల ఏళ్ల చరిత్ర కలిగిన భారతదేశం ప్రపంచానికే జ్ఞానాన్ని, సంస్కృతిని అందించిందన్నారు.
స్వతంత్రం కోసం ఒకరిని ఎదుర్కొంటే మరొకరొచ్చి దేశ ప్రజలను బానిసలుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు హిందువుల్లో ఐక్యత లేకపోవడమే ప్రధాన కారణమని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే డాక్టర్ హెడ్గేవార్ గొప్ప ఆలోచనతో స్వాతంత్ర్య పొందిన భారతదేశాన్ని ఏవిధంగా కాపాడుకోవాలన్న లక్ష్యంతోనే 1925 విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ను స్థాపించినట్లు తెలిపారు.
అప్పటి నుంచి నేటి వరకు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు దక్కించుకుందన్నారు. దేశభక్తి, సామాజికసమగ్రతను ప్రపంచానికి వివరిస్తూ విపత్తుల నుంచి ప్రజల్ని రక్షించడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంతో ఆర్ఎస్ఎస్ నిస్వార్థంగా పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు వాసుదేవరెడ్డి, బాణాల లక్ష్మీనారాయణ, మారం భానుమూర్తి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవాలు …

ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ప్రస్తానని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం జరిగిన శతాబ్ది ఉత్సవాలకు ఆర్ఎస్ఎస్ కర్నూలు, నంద్యాల విభాగ్ ప్రచారక్ సురేంద్ర, ముఖ్య అతిథిగా ఆత్మకూరు పట్టణ ఆర్ఎస్ఎస్ జేష్ట కార్యకర్త డాక్టర్ రంగసాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభాగ ప్రచార సురేంద్ర మాట్లాడుతూ 1925 అక్టోబర్ 25 విజయదశమి రోజున డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ని స్థాపించారని, అప్పటినుంచి నిరంతరాయంగా దేశభక్తి సామాజిక సమగ్రతను ప్రపంచానికి విస్తరిస్తూ, విపత్తుల నుండి ప్రజలను రక్షిస్తూ, భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో నిస్వార్థత లేకుండా వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. దేశ రక్షణలో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటుందని గుర్తు చేశారు. వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు లక్షలాది స్వయంసేవకులను తయారు చేసుకున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ ఆర్ఎస్ఎస్ అని కొనియాడారు. ఈ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని పంచ పరివర్తన్ పేరుతో సమాజ ఉన్నతికి తోడ్పాటు అందిస్తున్నట్లు వివరించారు. ఇందులో స్వయం సేవకులందరూ భాగస్వాములై ప్రజల్ని చైతన్యవంతుడిని చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఖండ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు వాసుదేవ రెడ్డి, బాణాల లక్ష్మీనారాయణ, మారం భానుమూర్తి, మహేష్, పాల్గొన్నారు.