- రూ.4 లక్షలు పలుకుతున్న టన్ను నన్నారి
- ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
- కళకళలాడుతున్న నన్నారి పంట
సుగంధ ద్రవ్యంగా, ఔషధంగా, శీతల పానీయంగా ఉపయోగపడే నన్నారికి భలే గిరాకీ ఏర్పడింది. దేశ, విదేశాల్లో నన్నారికి మం చి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని
AP చిత్తూరు : పీలేరు మండలానికి చెందిన ఓ రైతు నన్నారిని సాగు చేశాడు. వివరాల్లోకి వెళితే… మండలం లోని వేపుల బైలు పంచాయతీ జంగంపల్లెకు చెం దిన రైతు సురేంద్రరెడ్డి 5 ఎకరాల వ్యవసాయ పొలంలో నన్నారి సాగు చేశాడు. పంట కోతకు వచ్చే దశకు చేరుకుని కళకళలా డుతూ కనివిందు చేస్తుండడం తో రైతు కళ్లలో ఆనందం కన్పిస్తోంది.
సేంద్రియ పద్దతిలో సాగు..
నన్నారి పంట దిగుబడి వచ్చేందుకు రెండేళ్లు సమయం కాగా సురేంద్రరెడ్డి జంగంపల్లెలో సాగు చేసిన నన్నారి పంట మొదట రెండెకరాలలో పంట సాగు చేశాడు.
రెం డు నెలలు గడిస్తే రెండేళ్లు పూర్ణయి వేర్లు రూపంలో పంట దిగుబడి వస్తుంది. రెండో విడతలో మరో మూడు ఎకరాల్లో సాగు చేశాడు.
మొత్తం ఐదెకరాల్లోనూ సేంద్రియ పద్ధతి లోనే సాగు చేశాడు. జీవామృతం, పశువుల ఎరువు, వేస్ట్ డీ కంపోసిటర్ ఎరువులు తక్కువ ఖర్చుతో సాగు చేయ వచ్చని రైతు చెబుతున్నాడు.
పంట సాగులో నీరు తక్కువైనా, ఎక్కు వైనా తట్టుకునే స్వభావం ఉండడం తో నష్టం వాటిల్లుతుందనే భయం ఉండదు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ఈ పంటను పశువులు, ఇతర జంతువులు ఆశించవు. ఒక ఎకరా సాగు చేసేందుకు రూ.కోత దశకు వచ్చిన నన్నారి వేర్లు 1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
పంటకు మల్చింగ్ ఏర్పాటు చేసుకో వడానికి ఉద్యానశాఖ నుంచి ఎకరాకు రూ. 16వేలు ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. ఎకరాకు మూడు టన్నులకు పైగా దిగుబడి..
నన్నారి పంటలో రెండేళ్లకు వేర్లు బాగా ముదిరి దిగుబడి వస్తుంది. రెండేళ్లు పూర్తి చేసుకున్న పాలంలో ఎకరాకు మూడు టన్నుల పైగా దిగు బడి వస్తుంది.
నన్నారి వేర్లు టన్ను రూ. 4 లక్షలు చొప్పున మూడు టన్నులకు రూ.12 లక్షలు ఆదాయం వస్తుంది. ఒక ఎకరా సాగు చేసి రెండేళ్లు సంరక్షిస్తే ..
ఎకరాకు రూ.12 లక్షలు ఆదాయం గడించవచ్చని రైతు పేర్కొం టున్నాడు. బెంగళూరు, చెన్నైలలో నన్నారి వేర్లు విక్రయించేందుకు మార్కెటింగ్ సౌకర్యం ఉంది
– జి. సురేంద్రరెడ్డి, రైతు, జంగంపల్లె
మరింతగా ప్రోత్సహించాలి .. నేను సాగు చేసిన సన్నారి పంట దిగు బడి దశలో ఉంది. పంట బాగా ఉండడంతో చాలా సంతోషంగా ఉంది. రైతులు ఎక్కు వగా నన్నారి సాగు చేసు కోవడానికి ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాలి.
– వై.వి. రమణరావు, ఏడీఏ, పీలేరు Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
అంతర పంటగా సాగు చేయడం లాభ దాయకం నన్నారి దిగుబడి రావడానికి రెండు మూడు సంవత్సరాలు సమయం పడు తుంది. మామిడి పంటలో నన్నారిని అంతర పంటగా సాగు చేయడం చాలా లాభ దాయకం. మన ప్రాంతంలోని నేలలు నన్నారి సాగుకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యాన శాఖ మల్చింగ్ ఏర్పా టుకు రాయితీ ఇస్తోంది.