నంద్యాల SP రఘువీర్ రెడ్డి బదిలీ..కారణం హీరో అల్లు అర్జున్..!

Nandyala SP Raghuveer Reddy

Nandyala SP Raghuveer Reddy

నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జిల్లా పోలీస్ అధికారిగా రఘువీర్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం జరిగింది… వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు…

బాధ్యతలు చేపట్టిన ఈ అధికారి మరోఐదు నెలలలో పదవీ విరమణ చేయనున్నారు… ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు పదవి విరమణ చేస్తున్న..

చివరి రోజు వారి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం.. 25 నుండి 30 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కిందిస్థాయి అధికారులు..

నుండి పై స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరికి పదవి విరమణ రోజున తోటి ఉద్యోగులు కిందిస్థాయి సిబ్బంది బంధుమిత్రులు అందరూ..

కలిసి వీడ్కోలు సభ ఏర్పాటు చేసి ఉద్యోగం చేసిన రోజులలో ఆ ఉద్యోగి సమాజానికి మరియు ప్రజలకు చేసిన సేవలు కొనియాడి సత్కరించి గౌరవంగా వీడ్కోలు పలకడం అందరికీ తెలిసిందే….

ప్రతి ఒక్క ఉద్యోగి తన పదవి విరమణ రోజున వీడ్కోలు సభ ఎంతో వైభవంగా జరగాలని కోరుకుంటారు.

ప్రభుత్వం మారింది పాలకులు మారారు ఈ దశలో నంద్యాల జిల్లా పోలీస్ ఉన్నతాధికారి రఘువీర్ రెడ్డి నంద్యాలలోనే పదవీ విరమణ చేయాలని..

భావించడం తప్పులేదు ఒకవేళ బదిలీ అయితే మరో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనుండడంతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఈయనకు జిల్లా ఎస్పీగా..

బాధ్యతలు అప్పగించే అవకాశం తక్కువగా ఉంటుంది ఇక్కడి నుండి బదిలీపై వెళితే ఉన్నత స్థాయి అధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

జిల్లా ఎస్పీగా ఉండి పదవీ విరమణ జరగడం వేరు అధికారిగా పదవీ విరమణ జరగడం వేరు ఒకవేళ ఆయన బదిలీ అనివార్యమే అయితే తనకిందిస్థాయి..

సిబ్బందికి ఆయన చేయగలిగిన సహాయ మరియు సహకారాలు అందించాల్సిన బాధ్యత ఉంది కొత్తగా వచ్చే అధికారి ఇక్కడి పరిస్థితులు..

పాలకుల ఆలోచన విధానాలు తెలుసుకొని కింది స్థాయి సిబ్బందికి న్యాయం చేయాలంటే చాలా సమయం పడుతుంది..

జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి బదిలీకి ఏకైక కారణం ప్రముఖ సినిమా హీరో అల్లుఅర్జున్

ప్రముఖ సినిమా హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలింగ్.. రెండు రోజుల ముందు టిడిపి అధినేత ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

ఎన్నికల ప్రచార రోజే ఒకే సమయానికి అల్లుఅర్జున్ నంద్యాలకు రావడం కొంత గందరగోళ పరిస్థితి నెలకొనడం జరిగింది.

ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాత్రం ఈ విషయం లో ..

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

తన కిందిస్థాయి ఉద్యోగులు చేసిన పొరపాటుకు సరైన సమయంలో ఆయనకు సమాచారం ఇవ్వకపోవడమా.. ఒకవేళ సమాచారం తెలిసిన అప్పటి నాయకులను నొప్పించకుండా ఉండడమా దీనివలన శిక్ష అనుభవించక తప్పదా… వేచి చూడాలి….

…. చలం బాబు అధ్యక్షులు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నంద్యాల జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top