నంద్యాల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో కలెక్టర్ గారికి రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
అనంతరం సిపిఐ (యం యల్ )లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ మాట్లాడుతూ
నంద్యాల జిల్లా రైతులు వరుస విపత్తులతో,
కరువుకాటకాలతో నిత్యము పంటలు సాగు చేసి అప్పులు పాలవుతున్నారని ఏంతమంది పాలకులు వచ్చినా పాలకులు రాతలు బాగున్నాయి.
తప్ప రైతుల తలరాతలు మాత్రము చిద్రము అవుతున్నాయని వరుసగా ఖరీఫ్ లో నష్టపోతే పంటలుభీమా, లేదు,కదా కనీసం అరకోరగా పంటనష్టపరిహరము,
కరువు మండలాలు గా ప్రకటించినారు కాని రైతులకు పలితము మాత్రం శూన్యమని రఖీలోకూడ కరువుమండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారు.
తప్ప ఇంతవరకు సహయచర్యలు చేపట్టలేదని రైతులు పరిస్థితి రాను, రాను పాలకులపై నమ్మకముసన్నగిల్లుతున్నది.
సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి గత అయిదు సంవత్సరములలో ఒక్కరూపాయి కూడ నిధులు కేటాయించక పోవడం వలన రైతులు చాలా నష్ట పోయారని
ఈ ప్రభుత్వమైనా రైతులు అన్నివిధాలుగా అధుకోవాలని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన సాగు సాయం రైతుకు 20 వేలు ఈ ఖరీఫ్ సీజన్లోనే అందించేందుకు కృషి చేయాలని పెరిగిన ఉత్పత్తి ఖర్చుల కనుగుణంగా..
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు 3 లక్షల వరకు వడ్డీలేకుండా 5 లక్షల వరకు పావలా వడ్డీతో ఇవ్వాలని కౌలు రైతులకు గుర్తింపు..
కార్డులు ఇచ్చే ప్రక్రియ చేపట్టి రుణాలు అందించాలని రాష్ట్రంలోని ప్రాజెక్టుల క్రింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్, మైనర్ కాలువలతోపాటు..
డెల్టా ప్రాంతాల్లోని మురుగు నీటి కాలువుల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా..
రైతాంగానికి చెల్లించాల్సిన నిధుల బకాయలపై శ్వేతపత్రం విడుదల చేయాలని గత రబీకాలంలో ప్రభుత్వం సేకరించిన ధాన్యం బకాయిలను..
రైతాంగానికి వెంటనేచెల్లించాలని నూతనంగా ఏర్పడినప్రభుత్వం స్మార్ట్ మీటర్లను రద్దుపరచాలని ఖరీఫ్ సాగుకు పచ్చిరొట్టె,
Also Read నల్లమల అడవులకు గజరాజులు
విత్తనాలు, వరి, వేరుశనగ, కంది తదితర విత్తనాలను 90% శాతం సబ్సిడీ పై రైతులకు అందించాలని వ్యవసాయానికి అవసరమైన..
పనిముట్ల కొనుగోలుపై 50%శాతం సబ్సిడీ పై అందించాలని జిల్లా వ్యాప్తంగా కల్తీ విత్తనాలను అరికట్టి కల్తీ విత్తనాలను అమ్ముతున్న వ్యాపారులపై..
కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు తేవాలని పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక నిధులు కేటాయించి వర్షాకాలం..
ప్రారంభమైనందున మొక్కలు నాటే విధంగా ప్రభుత్వం యుద్ధప్రాతి పాదికాన చర్యలు చెపటాలని సేద్య పరికరాలకు 90%శాతం సబ్సిడీతో..
రైతులకు అందించి అటవీ జంతువుల దాడిలో మరణించిన రైతు కుటుంబాలకు 15 లక్షల రూపాయలు గాయపడిన వారికి 5లక్షల..
ఎక్స్ గ్రేసీయా చెల్లించాలని భీమా నిధులు విడుదల చెయ్యాలని వారు డిమాండ్ చేశారు.
Also Read Sony Bravia 139 cm (55 inches) 4K Ultra HD Smart LED Google TV KD-55X74L