విశ్వాసులతో కలిసి క్యాలెండర్ విడుదల చేసిన పాస్టర్ విజయ శ్రీధర్
నంద్యాల పట్టణంలొ ఎస్ పి జి గ్రౌండ్ కి సమీపంలో ఉన్న రెడీంప్షన్ చర్చి నందు ఆదివారం నాడు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా ప్రార్థనతో ప్రారంభించి క్రిస్మస్ గీతాలాపన చేశారు.గ్లోబల్ రెడీంప్షన్ చర్చి వ్యవస్థాపకులు పాస్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో పాస్టరమ్మ విజయ క్రిస్మస్ ఆరాధనా చేయించారు.అంతే కాకుండా చిన్నారులు క్రీస్తు జననం నాటికను చక్కగా ప్రదర్శించారు.అంతేకాకుండా క్రీస్తు మరియమ్మ మరియు క్రిస్మస్ తాత వేషధారనలతొ అలరించారు.అనంతరం క్రిస్మస్ కి సంబందించిన సందేశం పాస్టర్ శ్రీధర్ విశ్వాసులకు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం అని సాటి మనుషుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని నిస్సహాయుల పట్ల కరుణ కలిగి ఉండాలని శాంతియుతమైన జీవితాన్ని జీవించాలి.శత్రువుల పట్ల సైతం క్షమా గుణాన్ని కలిగి ఉండాలని ఏసుక్రీస్తు బోధనలు ఆచరణ ణీయమైనవని అన్నారు.అనంతరం 2023 కి సంబందించిన క్యాలెండర్ ని విశ్వాసులు చెన్నకేశవులు సతీష్ కుమార్ ప్రసాద్ మోహన్ సుబ్బారావు తదితరులతో కలిసి విడుదల చేశారు
గ్లోబల్ రెడీంప్షన్ చర్చిలొ ఘనంగా క్రిస్మస్ వేడుకలు
