ఇస్తేమా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
ఇస్తేమా కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి…. జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా
డివిజన్ స్థాయి పోలీస్ అధికారులతో సమీక్షించిన ఎస్పీ,
నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా,
ఆత్మకూరు పట్టణంలో ఎంతో ఆర్భాటంగా జరిగే ఇస్తేమా కార్యక్రమానికి కట్టదిట్టమైన భద్రత కల్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందని నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా అన్నారు
శుక్రవారం పట్టణ చివర్లో ఏర్పాటు చేసిన ఇస్తేమా ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు, ఇస్తేమా ఏర్పాట్లపై నిర్వాహకులను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకుని భద్రత ఏర్పాటు పై డిఎస్పి రామాంజి నాయక్ ను అడిగి తెలుసుకున్నారు,
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ఇస్తేమా కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు అత్యధిక భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఈ కార్యక్రమానికి లక్షలాదిగా ముస్లిం సోదరులు హాజరు కావడం జరుగుతుందన్నారు
డివిజన్ స్థాయి పోలీస్ అధికారులు సమన్యాయంతో ట్రాఫిక్ భద్రత సమస్యలు తలెత్తకుండా కట్టదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు,
ఇస్తేమా నిర్వాకులతో ఇతర శాఖ అధికారులతో సమన్యయ మై ఇజ్ తెమా ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు,
అనంతరం డిఎస్పి కార్యాలయంలో డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించి రికార్డులను పరిశీలించారు, కేసులు నేరాలు శాంతి భద్రతలపై ఆరా తీసి పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈయన వెంట డిఎస్పి రామాంజనేయ డివిజన్ లోని సిఐలు ఎస్సైలు ఉన్నారు.