ప్రకృతి అందాలను చూసే వేళ ఆసన్నమైంది
అక్టోబరు 1 నుంచి తెరుచు కోనున్న పర్యాటక కేంద్రాలు ఇష్టకామేశ్వరి,
రుద్ర కోడూరు క్షేత్రాల సందర్శనకు అవకాశం
వంద లాది వన్య ప్రాణులు.. వృక్ష జాతులకు నెలవైన నల్లమల అభయారణ్యం సందర్శనకు అవకాశం వచ్చింది.
పులుల ప్రత్యుత్పత్తి సమయంలో వాటి ఏకాంతానికి భంగం కలగ కుండా జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు మూడు నెలల పాటు అరణ్యంలో..
జన సంచారాన్ని అధికారులు నిషేధించారు. ఈ గడువు శనివారంతో ముగియనుంది. అటవీ ఆంక్షలు ముగియడంతో పర్యాటకులు..
నల్లమల అందాల వీక్షణతో పాటు అటవీ ప్రాంతం లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు అవకాశం కలిగింది.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
దేశ వ్యాప్తంగా ఉన్న 55 టైగర్ రిజర్వ్ ఫారెస్టుల్లో ఎన్టీసీఏ సెస్టెంబరు 30 వరకు అన్ని కార్యకలాపాలు నిషేధించింది.
నాగార్జున సాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యంలో 75 పులులు ఉన్నట్లు 2022 గణనలో తేల్చారు. దీని పరిధిలో పలు పుణ్య క్షేత్రాలు,
పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. గత మూడు నెలలుగా వీటి సందర్శనను నిషేధించారు. అక్టోబరు 1 నుంచి ఇవి పునః ప్రారంభం కానున్నాయి.
ఆలయాల సందర్శనకు వేళాయె
నల్లమల పరిధిలోని మార్కాపురం అటవీ డివిజన్‌లో ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం, వెలుగోడు పరిధి లోని రుద్రకోడూరు, గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రాలతో పాటు బైర్లూటి జంగిల్ సఫారీ, మార్కాపురం డివిజన్‌లోని తుమ్మల బయలు ఎకో టూరిజం కేంద్రం, జంగిల్ సఫారీల్లో మళ్లీ సందడి మొదలు కానుంది.
జంగిల్ సఫారీ చేద్దామా
నల్లమలలోని పర్యాటక కేంద్రాలు, జంగిల్ సఫారీల్లో అక్టోబరు 1 నుంచి ఆన్‌లైన్ సేవలు మొదలు కానున్నాయి.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ఎన్‌ఎస్‌టీఆర్.కో.ఇన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి చూడాలనుకున్న సఫారీని ఎంచుకోవాలి. నాగార్జున సాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలోని బైర్లూటి జంగిల్ క్యాంప్, పచ్చర్ల, రోళ్లపాడు, నెక్కంటి (ఇష్టకామేశ్వరి), తుమ్మల బయలు ప్రాంతాల్లో పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. బైర్లూటి జంగిల్ క్యాంప్‌లో 4 కాటేజీలు, 6 టెంట్‌హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. కాటేజీలో బస చేసేందుకు రోజుకు ఇద్దరికి రూ.6 వేలు, టెంట్‌హౌస్ ధర రూ.6500గా నిర్ణయించారు. 6 నుంచి పదేళ్లలోపు పిల్లలుంటే భోజనం ధర అదనం. పెద్దవారు ఒక్కరు అదనంగా వస్తే రూ.1500 చెల్లించాలి. ఈ మొత్తంతోనే అల్పాహారం, భోజనం, స్నాక్స్, అన్ని వసతులు కల్పిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకుల ద్వారా బైర్లూటి జంగిల్ సఫారీకి రూ.16,54,945 ఆదాయం సమకూరింది.
అడవి అందాలు ఆస్వాదించండి
పులుల ఏకాంతానికి భంగం కలగ కుండా అభయారణ్యాల్లో మూడు నెలల పాటు మానవ సంచారాన్ని నిషేధించారు. ప్రస్తుతం ఆ ఆంక్షలు తొలగాయి. అక్టోబరు ఒకటి నుంచి ఆన్‌లైన్ సేవలు పునః ప్రారంభం కానున్నాయి. పర్యాటకులు నల్లమల అందాలు ఆస్వాదించవచ్చు.
అలెన్‌చాన్‌టెరాన్ డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు అటవీ డివిజన్