నల్లమలకు అడవి దున్న – Adavi Dunna

Nallamala ku Adavi Dunna

Nallamala-ku-AdaviDunna - NALLAMALLALO-ADAVI-DUNNA

నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్

నల్లమలలో అడవి దున్న ప్రత్యక్షం .. షాక్ అయిన అటవీ అధికారులు..

అనుకోని అతిధి నల్లమలకు చేరింది. జీవా వైవిధ్యంతో అలరారుతున్న నాగార్జునసాగర్ శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలోని ఆత్మకూరు అటవీ డివిజన్…భైర్లుటి రేంజ్ లో అడవి దున్న ప్రత్యక్షమైంది. నల్లమల అడవుల్లో సుమారు 150 సంవత్సరాల క్రితం అదృశ్యమైన అడవి దున్న (బైసన్ )తిరిగి కనిపించడంతో వన్యప్రాణి ప్రేమికులు ఉప్పొంగిపోతున్నారు.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

నల్లమల అడవుల్లో 1870 కాలంలో అడవి దున్నలు (ఇండియన్ బైసన్)గా ప్రసిద్ధి

నల్లమల అడవుల్లో 1870 కాలంలో అడవి దున్నలు (ఇండియన్ బైసన్)గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు …నల్లమల అడవిలో విస్తారంగా తిరిగేవి.

అనూహ్యంగా 1870 ప్రాంతంలో అదృశ్యమైన అడవి దున్నసుమారు 150 ఏళ్ల క్రితం తర్వాత మళ్లీ నల్లమలలో ప్రత్యక్షం కావడం విశేషం.

కాగా ప్రస్తుతం నల్లమలకు పాపికొండలు ( పోలవరం అటవీ ప్రాంతం)… కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో మాత్రమే వుండే అడవి దున్న వేల కిలోమీటర్లు దాటుకొని నల్లమ లకు రావడం అద్భుతమైన విషయమని అటవీ అధికారులు చెబుతున్నారు.

నల్లమలలో సంచరిస్తున్న అడవి దున్న పాదముద్ర..

నాగార్జునసాగర్ శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలోని ఆత్మకూరు అటవీ డివిజన్…భైర్లుటి రేంజ్ లో

అడవి దున్న సంచ రిస్తుండగా దాని పాద ముద్రను అటవీ శాఖ అధికారులు గుర్తించి ఫోటో తీశారు.

జంతుజాలానికి నిలయమైన నల్లమల

అరుదైన జంతుజాలానికి నిలయమైన నల్లమలలో ఒకప్పుడు ఏనుగులు, ఆసియా చిరుత, అడవిదున్నల సంచారం ఉండేది. క్రమేణా అవి అంతరించాయి.

ప్రస్తుతం ఆసియా చిరుత భారతదేశంలోనే కనుమరుగైంది. అరుదైన జంతువుల సంరక్షణతో పాటు వాటి సంచారాన్ని విస్తరించడంలో భాగంగా..

అడవి దున్నను నల్లమలలోకి రప్పించేందుకు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సంస్థ ప్రణాళిక రూపొందించింది.

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

నల్లమలలో శతాబ్దం క్రితం అంతరించిన అడవి దున్నలు1870లో విస్తృతంగా ఉన్నట్లు బ్రిటీష్ గెజిట్ లో నమోదు..

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ : సింహాలను సైతం తరిమి కొట్టే బలమున్న అడవి దున్నలను మనం అనెమల్ ప్లానెట్ వంటి టీవీ చానళ్లలో చూస్తుంటాం.

భారత దేశంలో కూడా పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో భాగ మైన పాపికొండల్లో అడవి దున్నల ఉనికి ఉంది. అయితే జీవవైవిధ్యానికి ఆసియాలోనే..

ప్రాముఖ్యం వహించిన నల్లమల అడవుల్లో మాత్రం వీటి జాడ లేదు. ఒకప్పుడు ఈ అడవుల్లో విస్తారంగా వీటి సంచారం ఉన్నట్లు బ్రిటీష్ గెజిట్లు చెబుతున్నాయి.

ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎఫ్ ఓ కార్యాలయంలో ఇప్పటికీ భద్రంగా ఉన్న ఆనాటి బ్రిటిష్ గెజిట్ ఇందుకు సాక్ష్యంగా నిలిచింది.

అడవి దున్నలను నల్లమల కు తిరిగి చేర్చేందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ యత్నం..

అడవి దున్నలను నల్లమలకు

నల్లమలకు పూర్వ వైభవం తెచ్చేలా అడవి దున్నను తిరిగి ఇక్కడికి తేవ దానికి వన్యప్రాణి సంరక్షణ, అభివృద్ధిపై ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా ఒక ప్రణాళికను తయారు చేస్తోంది. అటవీ శాఖతో ఈ విషయమై ఇప్పటికే చర్చలు ప్రారంభించింది.

భద్రాచలం నుంచి నల్లమలలోకి ప్రవేశపెట్టేందుకు వ్యూహం..

పశ్చిమ కనుమల్లో తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలోని అడవి దున్నలను ప్రయోగాత్మకంగా నల్లమలలో ప్రవేశ పెట్టేందుకువ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఆత్మకూరులోని బైర్లూటీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన రెడ్డీస్ ల్యాబరేటరీస్ సౌజన్యంతో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కోటి రూపాయలను తూర్పుకనుమల ల్యాండ్ స్కేప్ కోసం మూడేళ్లలో ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగానే అడవి దున్నలను నల్లమల కు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అడవి దున్నలు భారత ఉపఖండంలో సంచారం..

అడవి దున్నలు భారత ఉపఖండంలోని బంగ్లాదేశ్, నేపాల్, భారత్ లోని పలు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో పశ్చిమ కనుమలు, దండకారణ్యం ప్రధాన ఆవా సాలుగా ఉన్నాయి. తూర్పు కనుమల్లోని గోదావరి ప్రాంతమైన పాపికొండల్లో వీటి ఉనికి ఉంది. ఆయా ప్రాంతాల్లో ఉండే వీటికి స్పష్టమైన ఆకార, వర్ణ భేదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవి ఐదు నుంచి 20 దాకా గుంపులుగా అడవుల్లో సంచ రిస్తాయి. భారీగా పెరిగిన అడవి దున్న సుమారు 800 కేజీల బరువు ఉంటుంది. ఆటవీ మైదా నాల్లోని గడ్డితో పాటు లేత వెదురు చిగుళ్లను ఆహారంగా తీసుకుంటాయి.

నల్లమల నుంచి ఎలా మాయమయ్యాయి..?

అడవిదున్నల జీవనానికి అవసరమైన విస్తార మైన గడ్డిమైదానాలు, వెదురువనాలు ఉన్న నల్లమలలో అడవిదున్నలు హఠాత్తుగా మటు మాయ మయ్యాయి. 19వ శతాబ్దం వరకు నల్లమల అడవుల్లో విస్తారంగా సంచరించి సందడి చేసిన అడవి దున్నలు 20 శతాబ్దంలో అంతరిం చిపోవడానికి కారణాలేమిటో అటవీ అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అటవీ రికార్డుల్లో తప్ప అడ వుల్లో అడవి దున్నల ఉనికి లేకుండా పోయింది. అడవి దున్నలు ప్రాణాంతక వైరస్ బారిన పడడం ద్వారా అవి అంతరించి ఉండవచ్చని ఒక అంచనా ఉన్నా ఎక్కడా రికార్డు కాలేదు. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (గాలికుంటు వ్యాధి) వల్ల కూడా అడవి దున్నలు విలుప్తమై ఉండవచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు.

అడవి దున్నలను తిరిగి నల్లమలకు అధ్యయన దశలో ఉంది.. సాయిబాబ డీఎఫ్ ఓ – ఆత్మకూరు

నల్లమలలో ఒకప్పుడు ఉన్న అడవి దున్నలను తిరిగి నల్లమలకు రప్పిం చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాం. అయితే అది ఇంకా అధ్యయన దశలో మాత్రమే ఉంది. ఈ విషయంలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్కు సంపూర్ణ సహకారం అందిస్తాం.

Read This

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top