నేషనల్ హైవే 340’c వల్ల నాలుగు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందన్న భయంతో విద్యార్థులు కుదేల్లవుతున్నారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని..ముష్టపల్లె , సిద్దెపల్లె, పెద్ద అనంతాపురం, డైరీ కొట్టాల గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గత 15 రోజులుగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు.
ఈ ఆందోళన కాస్త ముదిరి చిన్న పెద్ద తేడాలేకుండా అందరికి అవగాహన కలిగింది. ఆయా గ్రామాల నుండి ఆత్మకూరుకు బడికి వెళ్లే విద్యార్థులు , విద్యార్థినీలు..సైతం అక్కడ కనపడిన వారిని.. ఈ దారి మూసి వేస్తున్నారా.. మాకు బడికి పోవడానికి దారి లేదా.., మేము బడికి ఎలా పోవాలి.., మా దారి ఎటు.. అని అడగడం అందరిని కలచివేస్తుంది.
మనకు దారి లేదంటా..రా..అని.. నీళ్లు నములుకుంటూ.. ఒకరి మొహం మరొకరు చూసుకుంటూ.. దిక్కుతోచని స్థితిలో సతమత మవుతున్నారు.
విద్యార్థుల చదువులను దూరం చేయకుండా..నేషనల్ హైవే అధికారులు స్పంధించి పరిష్కారం చేయకపోతే చిన్నారులు సైతం ఎదురుతిరిగే పరిస్ధితులూ..లేక పోలేదు.
కుందేల్లు సైతం వేటకుక్కలను తరిమిన చరిత్ర కలిగిన రాయలసీమ పౌరుషం .. ఇప్పుడు విద్యార్థులు సైతం అధికారులపై ఎదురొడ్డి పోరాడే తత్వం ఏర్పడబోతోంది
చిన్నారుల భవిష్యత్తు ను అంధకారం లోకి నెట్టకుండా.. కాపాడే భాధ్యత..అధికారులు , నాయకులపైనే వుందని గ్రామస్తులు భావిస్తున్నాను.