- హైవే పనులను అడ్డుకున్న 4గ్రామాల ప్రజలు :
- మా గ్రామాలకు రహదారిని మూసివేస్తే నేషనల్ హైవే పనులను ముందుకు సాగనివ్వం
ఎన్నో దశాబ్దాల నుంచి గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉంటూ పట్టణానికి గ్రామాలే పట్టుకొమ్మలుగా ఉంటూ గ్రామీణ ప్రాంత ప్రజలు విద్య, వైద్యం ఇతర మౌళిక సదుపాయాల కోసం తరుచుగా పట్టణానికి రావాల్సి ఉంటుంది. పూర్వం నుంచి రహదారులను ఏర్పార్చుకున్న గ్రామ ప్రజలకు నేషనల్ హైవే రాకతో చివరకు విద్యనే మారం చేసుకునే రోజులు వస్తున్నాయని 4 గ్రామాలకు చెందిన ప్రజలు ఒక్కసారిగా నేషనల్ హైవే పనులను అడ్డుకున్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం అత్మకూరు పట్టణంలోని సిద్దపల్లి ఆత్మకూరు ప్రధాన రహదారి మూసి వేసే విదంగా జాతీయ రహదారి పనులను కొనసాగిస్తున్న విషయాని తెలుసుకున్న ముష్టపల్లి, సిద్దపల్లి, పెద్దలనంతపురం, డైరికొట్టాల గ్రామాల ప్రజలు నేషనల్ హైవే పనుల దగ్గర కాంట్రాక్టర్తో శనివారం వివాదస్పదంగా వాతవరణం నెలకొంది.
మా రహదారిని పునరుద్ధరణ కొనసాగించాలని గ్రామీణ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. అండర్ హైవే-నేషనల్ పనులు కొనసాగించడంతో పాత రహదారి మూసిపోతే గ్రామాల ప్రజలు ఏదైన అత్యావసర పరిస్థితులో చుట్టు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు. ఏదావిదంగా పాతరస్తానే కొనసాగించే విదంగా నంద్యాల జిల్లా కలెక్టరు, నేషనల్ హైవే పిడికి, స్థానిక ఎంఎల్ఎ బుడ్డా రాజశేఖరరెడ్డికి పిర్యాదులు ఇచ్చేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఏదిఏమైన్నప్పటికి నేషనల్ హైవే రాకతో గ్రామాలకు రహదారులు లేకపోతే నల్లమల అడవి ప్రాంతం అతి సమీపంలో గ్రామాలకు ఉండడంతో ఏ క్షణమైన ప్రాణపాయ పరిస్థితి జరిగితే ప్రాణాలు పోవడమే తప్పా చేసేదంటూ ఏమిలేదు. ఇప్పటికైన 4 గ్రామాల ప్రజలు సమస్యను పరిష్కారం చేసే విదంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిదులు, సిద్ధపల్లి ఆత్మకూరు. ప్రధాన రహదారిని ఎదవిదిగా కొనసాగించే విదంగా చొరవ తీసుకోవాలని గ్రామీణ ప్రాంత ప్రజలు మీడియా ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేశారు..