మున్సిపల్ కౌన్సిల్ సమావేశం – ఆత్మకూరు – నంద్యాల జిల్లా
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో చైర్పర్సన్ మారుఫ్ ఆసియా అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకి ఘన స్వాగతం పలుకారు.

అనంతరం కౌన్సిల్లో పలు విషయాలపై చర్చించి, సమస్యలను కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కౌన్సిల్ సహకారంతో ఆత్మకూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. పట్టణంలో డంపు యార్డ్, మంచినీటి సమస్య అధికంగా ఉందని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. పట్టణ అభివృద్ధికి అధికారులు నివేదికలు తయారు చేయాలన్నారు. గత ఐదేళ్లలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేసిన అవినీతిని బయటకు తీస్తామని.. శిల్పా ఇంట్లో పని చేసే వ్యక్తులకు మున్సిపల్ నిధుల నుండి జీతాలు ఇచ్చారని, అలాగే శిల్పా కుమారుడు కార్తీక్ రెడ్డి వ్యక్తిగత బౌన్సర్లకు శ్రీశైలం దేవస్థానం నిధి నుండి జీతాలు చెల్లించారన్నారు.. శిల్పా అవినీతినిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
