ముచ్చుమర్రి బాలిక జాడలేదు

Muchumarri girl was not found

Muchumarri girl was not found

ఆ బాలిక జాడ లేదు

పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్లు

ముగ్గురు తండ్రులు అరెస్టు

నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ వెల్లడి

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు మైనరు బాలలను అదుపులోకి తీసుకుని,

ఇద్దరు కుట్రదారులను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ తెలిపారు. నంద్యాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ..

రాష్ట్రంలో కలకలం రేపిన ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యం కేసులో పోలీసుల దర్యాపును వివరించారు.

ఈ సందర్భంగా ఆయన తెలిపిన అంశాలు ఇలా ఉన్నాయి. గత ఆదివారం మధ్యాహ్నం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక..

అడుకోవటానికి పార్కు కు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన ఆమె తండ్రి సంగెం చిన్న మద్దిలేటి స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

అదే రోజున బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బాలిక ఆచూకీ కోసం ఆత్మకూరు డీఎస్పీ అధర్వంలో గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ విచారణలో ఆ బాలిక పై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి, అమ్మాయిని గొంతు నులుమి చంపివేశారు.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

కొంత దూరం సైకిల్ పై, ఆ తరువాత మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని బాలిక శవాన్ని తరలించారు. తమ తల్లిదండ్రుల సాయంతో.. ఆ శవానికి రాయి కట్టి కృష్ణానది బ్యాక్ వాటర్ లో పడవేసినట్లు ప్రాథమిక దర్యాప్తు లో తేలింది. కర్నూల్ డీఐజీ , నంద్యాల జిల్లా ఎస్పీ, ముచ్చుమర్రి గ్రామం లోనే మకాం వేసి ఆ శవం కోసం గాలింపు చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

ఈ గాలింపు చర్యలలో సీఐ స్థాయి అధికారులను ఆరు టీమ్స్ గా ఏర్పాటు చేశారు. గజ ఈత బృందం, ఎన్డ్ ఆర్ ఎఫ్ టీమ్, లను, ఆరు స్పెషల్ పార్టీ బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, టెక్నికల్ టీమ్ లను రంగం లోకి దించి గాలింపు చర్యలు చేపట్టగా ఆ బాలిక ఆచూకీ లభ్యం కాలేదు.

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

ముగ్గురు మైనర్లను, తల్లి తండ్రుల ద్వారా అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలిక శవాన్ని నదిలో పడవేసినట్లుగా ప్రాథమిక దర్యాప్తు లో తేలటంతో కాటం. యోహన్, బొల్లెద్దుల .సద్గురుడు ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ప్రస్తుతం బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని ఎస్పీ వివరించారు.

మైనర్ బాలికశవం దొరకక ఇప్పటికి పదిరోజులు గడుస్తున్న జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కనీసం ఒక మంత్రికూడా ఘటన స్థలికి రాలేదని స్థానికులు మండిపడుతున్నారు మంత్రుల తీరుపై ఇప్పటికే పలు విద్యార్థి సంఘాల నేతలు అమ్మాయి తల్లిదండ్రులు తీవ్రంగా విమర్శించారు అయితే ఎట్టకేలకు ఈ సంఘటనపై నారా చంద్రబాబు నాయుడు స్పందించి హోం మంత్రి అనితను ఘటన స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top