- వైద్యవృత్తి పవిత్రమైనది
- వైద్యుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతా.
- ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఘన సన్మానం
వైద్యవృత్తి ఎంతో బాధ్యతగా, జాగ్రత్తగా, వత్తిడితో చేయాల్చి ఉంటుందని, డాక్టర్ వృత్తి ఎంతో పవిత్రమైనదని, వైద్యుల సమస్యలు కూడా తాను ఒక డాక్టర్ గా బాధ్యత తీసుకొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎంపీ గా తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు.
నంద్యాల మధుమణి నర్సింగ్ హోం సమావేశ మందిరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా వైద్యులనుద్దేశించి ఎంపీ శబరి మాట్లాడుతూ కోల్ కత్తా నగరంలో డ్యూటీ డాక్టర్ సస్య పై దాడి చేసి అత్యాచారం, హత్య చేయడం చాలా బాధేస్తోందని, దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
రాత్రి వేళలో డ్యూటీ డాక్టర్ల కు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, రాష్ట్ర వైద్యుల రక్షణ చట్టంలో సవరణలు చేసి ఏడేళ్లు దోసులకు శిక్ష పడేలా చూడాలని, డాక్టర్ల ప్రొటక్షన్ యాక్టు కేంద్రం తీసుకురావాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ చేసి ప్రాథమిక ఆధారాలు ఉంటేనే డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆమె కోరారు. నంద్యాల ఐ ఎం ఏ ఆధ్వర్యంలో డాక్టర్ వసుధరాణి నాయకత్వంలో వైద్యులు నల్లమల అరణ్యంలోని చెంచు ( గిరిజన ) గూడెంలకు వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం అన్నారు.
నంద్యాల ఐ ఎం ఏ ఆధ్వర్యంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎం ఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ జి. రవికృష్ణ, మాజీ నంద్యాల అధ్యక్షురాలు డాక్టర్ వసుధరాణి, ప్రస్తుత అధ్యక్షులు డాక్టర్. సి. మధుసూదన్ రావు, కార్యదర్శి. డాక్టర్ ఫణిత్ కుమార్, సీనియర్ డాక్టర్ గెలివి సహదేవుడు, వైద్యులు విజయభాస్కర్ రెడ్డి, అనిల్ కుమార్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Also Read తుంగ (గడ్డలు) ముస్తలతో శరీర దుర్వాసన మాయం
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..