అకాల వర్షాలతో కుదేలయిన మొక్కజొన్న రైతులు
నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో శనివారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షంతో రైతులు కుదేలయినారు. మొక్కజొన్న రైతులు పంటను కోతకోసి కళ్లాలలో ఆరబెట్టుకున్నారు. ఈ అకాల వర్షంతో అరబెట్టుకున్న మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. అధిక పెట్టుబడులు పెట్టి చేతికి వచ్చిన పంట ఇలా నీటి పాలు కావడంతో వ్యాపారస్తులు వాటిని కొనలేని పరిస్తితి ఏర్పడింది. దీంతో రైతులు భయాందోలనకు గురవుతున్నారు. తడిసిన మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వెదుకున్నారు.
పాములపాడు లోని కేజీ రోడ్డు ఇరువైపులా వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని సిపిఐ నాయకులు పరిశీలించి రైతులను పరామర్శించారు.అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు అన్నారు.తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నకు 3300, సోయా బీన్స్ ను 6000 ప్రకారం కొనుగోలు చేయాలని సిపిఐ నాయకులు. డిమాండ్ చేశారు.
Also Read అంకాళమ్మ కోట – Ankalamma Kota
- మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి..సిపిఐ
- కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్దం
- మొక్కజొన్న రైతులందరూ కదలిరండి. సిపిఐ.
నంద్యాల జిల్లాలో సాగవుతున్నటువంటి పంటలలో.వరి,తర్వాత అధిక విస్తీర్ణంలో సాగుతున్న పంట మొక్కజొన్న పంట. మహానంది మండలంలో. తమ్మడపల్లి రైతులతో మాట్లాడుతున్న. సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న. భాస్కర్.రాధాకృష్ణ.వారు ఆర్. సామేలు.మాట్లాడుతూ. మొక్కజొన్న పంట రైతులకు ఎక్కువ శ్రమ లేకుండా ఉండటం. పంట దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండడంతో. రైతన్నలు ఎక్కువగా మొక్కజొన్న పంట వైపు చూస్తున్నారు పంట చేతికి వచ్చిన తర్వాత పంట మీద వచ్చే సగం ఆదాయం దళారులు వ్యాపారుల చేతిలోకి వెళుతుంది.సెప్టెంబరు మొదటి వారంలో క్వింటా 2950/ రూపాయలు. ఉన్న మొక్క జొన్న. 2350.రూపాయలకు పడిపోయింది. కారణం వ్యాపారులు సిండికేట్ కావడమే దీనికి రైతన్నలు కూడా ప్రశ్నించలేని పరిస్థితి.
కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్దం
కారణం దళారుల దగ్గర పెట్టుబడికి వడ్డీల రూపంలో డబ్బులు తీసుకోవడమే. అంతేకాకుండా దళారులు వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి కొత్తగా ఇంకొక వ్యాపారస్తుల్ని గ్రామంలోకి రానివ్వకుండా చేస్తున్నారని పైగా కొత్తగా వచ్చే వ్యాపారులను రైతులు నమ్మలేకపోవడం. కారణం వ్యాపారులు ఐపీలు.పెట్టి రైతులకు డబ్బులు ఎగ్గొట్టడం మనం వార్తాపత్రికల్లో టీవీల్లో చూస్తూ ఉన్నాం. వ్యాపారుల దగ్గర సరుకు ఉన్నంతవరకు 2950/ రూపాయలు ఉన్న క్వింటా.మొక్కజొన్నలు రైతులకు పంట చేతికి వచ్చే సమయానికి 2350/rs. లకు పడిపోవడం.రైతులు ఎంత నష్టపోతున్నారో స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు . దీనికి అంతటికి కారణం ఎవరు. వ్యాపారస్తులు దళారులు సిండికేట్ అవ్వడమే. అందుకే భారత కమ్యూనిస్టు పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో. 7-10-2024 వ తేది సోమవారం కలెక్టర్ దగ్గర ధర్నా నిర్వహించి. కలెక్టర్ గారికి రైతులు కష్టాలు చెప్పాలని పై నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో..రైతు సంఘం నాయకులు గురుమూర్తి. లక్ష్మయ్య వెంకటేశ్వర్లు. నరసింహులు పాల్గొన్నారు. Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV