మొబైల్స్ రికవరీ మేళా – కర్నూలు జిల్లా ఎస్పీ

Mobiles Recovery Mela - Kurnool District SP

Mobiles Recovery Mela - Kurnool District SP

కర్నూలు జిల్లా… రికవరీ చేసిన 587 ( విలువ రూ.1 కోటి 33 లక్షల 70 వేలు ) మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు . • జిల్లా పోలీసు కార్యాలయంలో “ మొబైల్ రికవరీ మేళా ” కార్యక్రమం.• మొబైల్ ఫోన్ లు పోగొట్టుకున్నవి రికవరీ చేసి ఇవ్వడం తో ఆనందం వ్యక్తం చేసిన బాధితులు. • మొదటి సారిగా ఒకే సారి సాంకేతిక పరిజ్ఞానంతో 587 సెల్ ఫోన్లు రికవరీ చేసిన కర్నూలు పోలీసులు . http://Kurnoolpolice.in/mobiletheft లింకును క్లిక్ చేసి , సెల్ ఫోన్లు పోగోట్టుకున్న బాధితులు ఆ మొబైల్ ఫోన్ వివరాలు నమోదు చేయండి. • ఉచితంగా సెల్ ఫోన్ రికవరీ చేస్తాం… ఎలాంటి రుసుము లేదా ఫీజు గాని ఉండదు. • http://Kurnoolpolice.in/mobiletheft పోలీసు సేవా ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండండి.

• డిజిటల్ అరెస్ట్ , ఈజీ మనీ, షేర్స్ లలో పెట్టుబడులు పెట్టండి అని ఆశ చూపించి సైబర్ నేరగాళ్ళు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. … ఎవరు నమ్మవద్దు…. జిల్లా ఎస్పీ. శుక్రవారం కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు రికవరీ చేసిన 587 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు బాధితులకు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్లు ను బాధిత ప్రజలకు అందజేశారు..

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు మిడియాతో మాట్లాడారు..మొబైల్స్ రికవరీ చేయడం లో సైబర్ ల్యాబ్ పోలీసుల కృషి ఎంతో ఉందన్నారు. ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు. అటాచ్ మెంట్స్, బ్యాంకు ఎటిఎం, బ్యాంకు ఖాతాలు, సెంటిమెంట్స్, పర్సనల్ సమాచారం, ఎన్నో సేవలు మొబైల్ ద్వారా వినియోగిస్తామన్నారు. మొబైల్ పోగోట్టుకుంటే ఏలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా http://Kurnoolpolice.in/mobiletheft కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు వెళ్ళి పొగోట్టుకున్న సెల్ ఫోన్ వివరాలు అందజేస్తే సెల్ పోన్ రికవరీ చేసేందుకు కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు కృషి చేస్తారన్నారు. ఉచితంగా ఈ సేవలందిస్తామన్నారు. ఎలాంటి రుసుము ఉండదు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరాల పై అవగాహన కలిగి ఉండాలన్నారు. కర్నూలు పోలీసు ఫేస్ బుక్, ఇన్ స్ట్రా గ్రాం, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.

డిజిటల్ అరెస్టు

ఇటీవల కాలంలో కొత్తగా డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో సైబర్ నేరాలు ఎక్కువగా జరగుతున్నాయి. డిజిటల్ అరెస్టు అనే పేరుతో సైబర్ నేరగాళ్ళు కాల్ చేస్తారు. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేదా పోలీసులం అని చెప్పి నకిలీ యూనిఫాం ధరించి విడియో కాల్ చేసి మాట్లాడతారు.
డబ్బులు అక్రమంగా సంపాదిస్తున్నారని, మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు ట్రాన్ఫర్ చేస్తే అరెస్ట్ చేయము. ట్రాన్ఫర్ చేయకపోతే అరెస్టు చేస్తాము అని విడియో కాల్ చేసి మాట్లాడుతారు. కొంతమంది బాధితులు భయపడి వారి సైబర్ నేరగాళ్ళ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించి మోసపోతున్నారు. అటువంటి వాటిని ఎవరు నమ్మవద్దు. ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే ప్రజలు డయల్ 100 గాని, లేదా డయల్ 112 కు గాని కాల్ చేసి సమాచారం అందిచండి.

Plzaap Instalationhttps://play.google.com/store/apps/detailsid=com.ravindra.news&pli=1

సైబర్ నేరాల బారిన పడితే వెంటనే ప్రజలు డయల్ 1930 కి ఫోన్ చేసి సమాచారం అందించండి. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లో www.cybercrime.gov.in ఫిర్యాదు చేయండి. ఈజీ మనీ, ఆన్ లైన్ షేర్స్ లలో డబ్బులు పెట్టుబడి పెట్టండి రూ. 10 లు పెట్టుబడి పెడితే రూ. 100 లు వస్తుందని ఆశ చూపించి మోసం సైబర్ నేరగాళ్ళ మోసం చేస్తున్నారు. ఎవరు నమ్మవద్దు. తెలిసినవారు తెలియని ప్రజలకు తెలియజెప్పండి. సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయని అవగాహన కల్పించండి. జిల్లా ఎస్పీ గారికి, సైబర్ ల్యాబ్ పోలీసులకు సెల్ ఫోన్ పొగొట్టుకున్న బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇందులో… 1) మధుసుధాకర్ – కర్నూలు. న్యూ ఇండియన్ ఎక్సప్రెస్ ఇంగ్లీష్ పత్రిక లో పని చేస్తున్నాను. 2023 జూన్ లో మా ఇంటిలో మా అమ్మాయి ఫంక్షన్ లో తీసిన ఫోటోలు పోయినవి. ఇంట్లో అందరం చాలా భాద పడ్డాం. ఈ మొబైల్ దొరకడం తో చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం బ్యూటీఫుల్ అని, టెక్నాలజీ ఉపయోగించి కృషి చేసిన కర్నూలు ఎస్పీ గారికి, సైబర్ ల్యాబ్ పోలీసులకు కృత జ్ఞతలన్నారు.

2) ఉమా మహేశ్వరి – కర్నూలు. సచివాలయ మహిళా పోలీసుగా పని చేస్తున్నాను. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు నా మొబైల్ ను ఎవరో తెలియని వ్యక్తులు తీసుకెళ్ళి పోయారు. ఉద్యోగం, ఎలక్షన్ విధులకు సంబంధించిన చాలా వర్క్ సెల్ ఫోన్ లో ఉండేవి. ఎలక్షన్ సమయంలో చాలా బాధపడ్డాను. కర్నూలు త్రీ టౌన్ పోలీసుస్టేషన్ లో http://Kurnoolpolice.in/mobiletheft లో ఫిర్యాదు చేయడం జరిగింది. నా మొబైల్ దొరకడం తో చాలా ఆనందంగా ఉంది. కర్నూలు పోలీసులకు కృత జ్ఞతలన్నారు.

3) జాఫర్ – కర్నూలు. వాచ్ మెన్ గా పని చేస్తున్నాను. నౌకరి పని చేసే సమయంలో ఫోన్ పోయింది. సైబర్ ల్యాబ్ పోలీసులను సంప్రదించి http://Kurnoolpolice.in/mobiletheft లో ఫిర్యాదు చేయడం జరిగింది. నా మొబైల్ దొరకడం ఆనందంగా ఉందని ఎస్పీ గారికి కృతజ్ఞతలన్నారు.

Also Read https://politicalhunter.com/tirumala-laddu-mp-byreddysabari/

4) చిన్నరంగయ్య – చనుగొండ్ల గ్రామం. గూడూరు మండలం, చనుగొండ్ల గ్రామం మాది. విజయవాడకి వెళ్ళే సమయంలో కర్నూలు ఆర్టీసి బస్ స్టాప్ లో మొబైల్ పోయింది. నా మొబైల్ దొరకడం ఆనందంగా ఉందని పోలీసులకు కృతజ్ఞతలన్నారు.

5) ప్రవళిక – ఈ. తాండ్రపాడు. గవర్నమెంట్ హాస్పిటల్ లో మొబైల్ పోయింది. నా మొబైల్ దొరకడం ఆనందంగా ఉందన్నారు. కర్నూలు పోలీసులకు కృతజ్ఞతలన్నారు.

మొబైల్ ఫోన్ పోగోట్టుకున్న బాధితుడు మొదటగా చేయాల్సిన పని.

http://Kurnoolpolice.in/mobiletheft ఈ లింకు ను క్లిక్ చేసి, పోగోట్టుకున్న మొబైల్ వివరాలను తెలియజేయాలి. లింక్ ను క్లిక్ చేసి మొబైల్ LOST కాలమ్ నందు మీ పేరు,మీ జిల్లా ,మీ పోలీస్ స్టేషన్ పరిధి ,మీ మొబైల్ కు సంబంధించిన వివరాలు , మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్ /alternate కాంటాక్ట్ వివరాలు సబ్ మిట్ చేయాలి. ఈ విధంగా మీరు ఫిర్యాదు చేసినచో కర్నూలు పోలీసు వారు మీ మొబైలు ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని, ఈ పోలీసు సేవ కు ఏలాంటి రుసుము చెల్లించకుండా ఉచితం అని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సిఐలు సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం శ్రీనివాసులు, అబ్దుల్ గౌస్, కేశవరెడ్డి , సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం సిబ్బంది ఉన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం – కర్నూలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top