సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి
మన సమాజం – మన బాధ్యత సదస్సులో పిలుపునిచ్చిన మంత్రి ఫరూక్
విజయవాడ సెప్టెంబర్ 23 ( రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి కార్యాలయం,అమరావతి)
జాతి కుల మత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం అయినప్పుడే దేశ అభివృద్ధి పరుగులు పెడుతుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. సోమవారం రాత్రి లబ్బీపేట జి.ఆర్.టి హోటల్లో అఖిలభారత మానవతా సందేశ సమితి సంస్థ ఆధ్వర్యంలో అవర్ సొసైటీ- అవర్ రెస్పాన్సిబిలిటీ పేరుతో డైలాగ్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్,రిటైర్డ్ ఐజీ వెంకటేశ్వరరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం, డాక్టర్ దుర్గారావు, రిటైర్డ్ జడ్జి డాక్టర్ చక్రధర్, మైనారిటీ ప్రతినిధులు మౌలానా బిలాల్ అహ్మద్ నద్వి, ఫారూఖ్ షుబ్లీ ఫాదర్ జోసఫ్, సర్దార్ పింకీ జి హరి సిందర్ సింగ్ తోపాటు వివిధరంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈసందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మానవతా విలువలతో జీవనం సాగించినప్పుడే, కష్టాల్లో ఉన్న ఎదుటివారిని ఆదుకోవడం ద్వారా, అండగా నిలబడడం ద్వారా మానవత్వం పరిమళిస్తుందని అన్నారు.నైతిక విలువలు,ప్రేమ, నమ్మకం, సత్ ప్రవర్తన తో కూడిన క్రమశిక్షణ తదితర వాటిని ప్రతి ఒక్కరూ అనుసరించడం, ఆచరించడం ద్వారా మన సమాజం -మన బాధ్యత నినాదంతో సమాజాభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.
సర్వ మతాలకు నిలయంగా భారతదేశం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతను సాధించుకున్నదని, ఆదర్శప్రాయంగా నిలిచిందని, జాతి,కుల మతాలకు అతీతంగా సర్వ మత సౌభ్రాతృత్వం మరింత పరిఢవిళ్లాలంటే ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలతో కృష్ణానది, బుడమేరు ఉగ్రరూపంతో విజయవాడ అతలాకుతలమైందని, ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. విపత్తు కారణంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న ముంపు వరద బాధితులను ఆదుకునేందుకు కుల మతాలకు అతీతంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు వేల సంఖ్యలో దాతృత్వ చేతులు అండగా నిలవడమే మన సమాజం- మన బాధ్యత జ్ఞప్తికి తెచ్చిందని అన్నారు. విపత్కర పరిస్థితులలో ఆపన్న హస్తాల చేయూతతో అతి తక్కువ సమయంలోనే వరద బాధితులను ఆదుకోవడం లో ప్రభుత్వ చర్యలు సఫలీకృతం అయ్యాయని అన్నారు.ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రధాన వక్తలుగా ప్రసంగించారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV