బనగానపల్లె పట్టణంలో ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ను ప్రారంభించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి మరియు జిల్లా ఎస్పీ గారు
బనగానపల్లె పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలి
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ను రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి BC జనార్దన్ రెడ్డి గారు మరియు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా, IPS గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖమంత్రి BC జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ బనగానపల్లె పట్టణంలో ట్రాఫిక్ ను నియంత్రించి ప్రజలు సురక్షితంగా గమ్యం చేరేందుకు చర్యలు తీసుకోవాలని కోరిన వెంటనే జిల్లా ఎస్పీ గారు తమ వంతుగా కృషి చేస్తామని తెలియజేసి ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బందిని కేటాయించడం జరిగిందని ఇది చాలా సంతోషించవలసిన విషయమని అభినందించారు. ముందుగా ట్రాఫిక్ నియంత్రించాలి అంటే ప్రజలు సహకరించాలని మీరు ఏదైనా షాప్ కు వెళ్లినప్పుడు గాని మీ యొక్క సొంత పనులపై బయటికి వచ్చినప్పుడు గాని ఇతరులకు ఇబ్బంది లేకుండా మీ యొక్క వాహనాలను రోడ్ల పైన పార్కింగ్ చేయరాదని తెలియజేశారు మరియు సురక్షితంగా మీరు వెళ్ళవలసిన గమ్యం చేరేందుకు రోడ్డు భద్రత నిబంధనలు, ట్రాఫిక్ నియమ నిబంధనలు అందరూ పాటించాలని కోరారు.
Also Read వైద్యవృత్తి పవిత్రమైనది – ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
జిల్లా ఎస్పి గారు మాట్లాడుతూ బనగానపల్లె పట్టణం విస్తరిస్తూ జనసంఖ్య పెరుగుతూ నగరంగా రూపుదిద్దుకుంటున్న సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయుటకు మంత్రిగారి సహకారంతో ట్రాఫిక్ అవుట్ పోస్టును ఏర్పాటు చేయడం జరిగిందని, పట్టణంలో ముఖ్యంగా 07 ప్రధాన కూడళ్ళు కనుగొని ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు.
ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బందిని నియమించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు కావలసిన పరికరాలను, పెట్రోలింగ్ వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. పట్టణంలో ఎక్కడైనా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పుడు 112 అనే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ కాల్ చేసిన వెంటనే ట్రాఫిక్ సిబ్బంది స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ,మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మోటార్ సైకిల్ పై ప్రయాణించుచున్నప్పుడు హెల్మెట్ ధరించాలని, ఓవర్ లోడ్ తో వాహనాలు నడప రాదని,మోటార్ వెహికల్ చట్టాన్ని ఎవరు ఉల్లంఘించరాదని తెలియజేశారు. పట్టణం లో ట్రాఫిక్ నిబందనలు అమలులో ఉంటాయి కావున ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు మరియు జిల్లా ఎస్పీ గారితో పాటు డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారు, ఇన్స్పెక్టర్లు మంజునాథ్ గారు, కృష్ణయ్య గారు, వెంకటేశ్వరరావు గారు, సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.