ప్రభుత్వ పాఠశాలను మంత్రి నారాలోకేష్ ఆకస్మిక తనిఖీ

Minister Naralokesh inspection school

Minister Naralokesh inspection school

  • ఐదేళ్లలో దేశంలోనే ఏపీ మోడల్ అనేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతాం
  • ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తాం
  • అకనంబట్టు జడ్పీ హైస్కూల్లో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు

పూతలపట్టు: పూతలపట్టు నియోజకవ్గం అకనంబట్టు జిల్లా పరిషత్ హైస్కూల్ ను రాష్ట్రవిధ్యా, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 8,9,10 తరగతి విద్యార్థుల క్లాస్ రూమ్ లను సందర్శించిన మంత్రి లోకేష్ అక్కడి లోటుపాట్లపై విద్యార్థులను ఆరా తీశారు. కొంతమంది విద్యార్థులు ఇంకా తమకు టెక్స్ట్ బుక్స్ అందలేదని చెప్పడంతో తక్షణమే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పాఠ్యాంశాలను ఏ లాంగ్వేజ్ లో భోదిస్తున్నారని మంత్రి అడగ్గా.. తెలుగు, ఇంగ్లీషు రెండింటిలో చెబుతున్నారని విద్యార్ధులు చెప్పారు. స్కూలులో బెంచీలు లేకపోవడంతో నేలపై కూర్చొని చదువుకోవాల్సి వస్తోందని.. విద్యార్థులు చెప్పగా, త్వరలో ఫర్నీచర్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

టాయిలెట్స్ పరిశుభ్రతపై ఆరా తీయగా, గత మూడు నెలలుగా ఇదివరటికంటే మెరుగ్గా ఉన్నాయని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.నేను మీ అన్నలాంటి వాన్ని ఎలాంటి సమస్య ఉన్నా నాకు చెప్పండి అని మంత్రి విద్యార్థులను కోరారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను ఉత్తమంగా తీర్చిదిద్ది, దేశంలో ఏపీ మోడల్ అని చెప్పుకునేలా చేస్తామని అన్నారు. యూరప్ వంటి దేశాల్లో మాతృభాషను ప్రోత్సహిస్తున్నారని, మన రాష్ట్రంలో తెలుగు విద్యార్థులు ఇంగ్లీష్ లో చదువుకోవడానికి కొంత ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. అయితే ఉన్నత చదువులకు వెళ్లాక ఇంగ్లీష్ అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. అన్ని ఆలోచించి ఈ విషయంపై సముచితమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు టీచర్లతో మంత్రి లోకేష్ సమావేశం అయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 70 శాతం మాత్రమే ఉండటానికి కారణమేంటని ప్రశ్నించారు. పాఠశాలలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చాల్సి ఉందని టీచర్లు మంత్రికి చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లపై ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని వారు పేర్కొన్నారు. నేను ఎవర్నీ తప్పుబట్టడానికి రాలేదు. పారదర్శకమైన విధానాలతో విద్యాప్రమాణాలను మెరుగు పర్చడమే మా లక్ష్యం. గతంలో ఉపాధ్యాయులకు టాయిలెట్స్ బాధ్యత అప్పగించి తీవ్రంగా అవమానించడం బాధాకరం. ఒక్కసారిగా ప్రభుత్వ స్కూళ్లను మార్చడం సాధ్యమయ్యేది కాదు. మౌలిక సదుపాయాలను కల్పించి క్రమేణా విద్యా ప్రమాణాలను మెరుగు పరుస్తాం. వెనుకబడిన విద్యార్థులపై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అందరం కలిసికట్టుగా ప్రభుత్వ స్కూళ్లను ఉత్తమంగా తీర్చిదిద్దుదామని అన్నారు.

Plzaap Instalationhttps://play.google.com/store/apps/detailsid=com.ravindra.news&pli=1

విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత టీచర్లపై ఉందని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 55% విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారని, ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నది 45% మంది మాత్రమే అని చెప్పారు. గతంలో ప్రభుత్వం అందజేసిన ట్యాబ్ లలో విద్యార్థులు అనవసరమైన కంటెంట్ చూస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయంలో టీచర్లు డేగకన్ను వేసి ఉంచాలని సూచించారు. ఇకపై ట్యాబ్స్ కు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే కంప్యూటర్ ల్యాబ్స్ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. హైస్కూల్లోని కొన్ని తరగతి గదులు పెచ్చులూడుతున్నాయని టీచర్లు చెప్పగా, మరమ్మతులు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రభుత్వ స్కూళ్లలో వాతావరణం తెలుసుకోవడానికే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నానని.. విద్యాశాఖ మంత్రిగా నేర్చుకోవడానికే మీ ముందుకు వచ్చానని చెప్పారు. గతంలో తాను పంచాయతీ రాజ్ మంత్రిగా ఏ నిర్ణయమైనా వెనువెంటనే తీసుకునేవాడినని.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ తో కూడుకున్నందున విద్యాశాఖలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తరగతి గదుల పరిశీలన అనంతరం విద్యార్థులు, టీచర్లతో లోకేష్ ఫోటోలు దిగారు.

Also Read తిరుమల ప్రసాదంపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శభరి ఫైర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top