- దుకాణాల పక్కనే మద్యపానం..
- రాజకీయ అండదండలతో ఇష్టారాజ్యం
- నాయకుల గుప్పిట్లో ఎక్సైజ్ అధికారులు..?
- ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పోలీసులు
- గ్రామాల్లో జోరుగా ‘బెల్ట్’ అమ్మకాలు
ఆత్మకూరు ప్రాంతంలో కొంతమంది మద్యం దుకాణదారులు బరితెగించారు. రాజకీయ అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మద్యం దుకాణాలు ఏర్పాటు మొదలుకొని నేటి వరకు నిబంధనలకు పాతరేసి దర్జాగా తమ దందా సాగిస్తున్నారు. అరికట్టాల్సిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పోలీసు అధికారులు రాజకీయ నాయకుల గుప్పెట్లో పావులుగా మారారన్న విమర్శలు ఉన్నాయి. ఆత్మకూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 13 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో ఆత్మకూరు అర్బన్, రూరల్ పరిధిలో 6. వెలుగోడు 3. సున్నిపెంటలో 2, కొత్తపల్లి 1, పాములపాడు 1 చొప్పున దుకాణాలు ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వ పాలనకే మాయని మచ్చలా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి..
మాట వినకుంటే చిక్కులే..
నిబంధనల ప్రకారం లాటరీ వద్దతిలో మద్యం దుకాణాలను దక్కించుకున్న వారు స్థానిక రాజకీయ నాయకుల మాట వినకుటే చిక్కులు తప్పడం లేదు. వింటే సరి వినకపోతే తమ వారికి తెచ్చుకునేందుకు పోలీసు, ఎక్సైజ్ అధికారులనే పావుగా వాడుకుంటున్నారన్న విమర్శలు వున్నాయి.
ప్రత్యేకించి కొత్తపల్లి , పాములపాడు , మద్యం దుకాణాలకు సంబంధించి నేటికీ రాజకీయ నాయకులచే ఒప్పందం పెదరలేదని తెలుస్తోంది. దీంతో ఆయా దుకాణదారులకు సదరు నేతలు తమ పలుకుబడి ఏమిటో చూపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని చిన్న వాటికే కేసులు. నమోదు చేయిస్తున్నట్లు సమాచారం. ఆయా దుకాణాల వారు. ఏ చిన్న తప్పు చేసినా వదలకూడదని కన్నేసి ఉంచుతున్నారు. అంతేకాదు రెండు దురాణ ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఆయా మండలాల్లోని అన్ని గ్రామాల్లోని బెల్ట్ దుకాణాలకు నందికొట్కూరు నుంచి ప్రతిరోజూ మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఎక్సైజ్, పోలీసు అధికారులకు తెలిసినా మిన్నకుండినట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే ఈ నెల 26వ తేదీన కొత్తపల్లి మండలంలోని శివపురం గ్రామంలో ముగ్గురు వ్యక్తుల నుంచి క్వార్టర్ సీసాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ముగ్గురు వ్యక్తులు అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత ప్రోత్సాహంతోనే బెల్టు షాపలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో కేసును నీరుగార్చి ముగ్గురిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఇలావుంటే వెలుగోడు, సున్నిపెంటలో రాజకీయ నేతల ఒప్పందాల మేరకే మధ్యం షాపులు నడుస్తున్నట్లు తెలిసింది.
సీఎం చెప్పినా తీరు మార్చుకోని వైనం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త మద్యం పాలసీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తొలుత మద్యం షాపుల టెండర్లలోనే కొంత మంది రాజకీయ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో సీఎం చంద్రబాబే నేరుగా రంగంలోకి దిగి సదరు నేతలను హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసింది. అదే క్రమంలో మధ్యం వ్యవహారంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేదే లేదని స్పష్టం చేసినా నేటికీ కొంతమంది తమ తీరును మార్చుకోవడం లేదని తెలుస్తోంది.
గతంలో వైసీపీ నాయకులు కూడా ఇదే తరహాలో వ్యవస్థలను పరిగణలోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే ప్రజా గ్రహానికి గురి కావాల్సి వచ్చింది. అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా మద్యంలో ఆక్రమార్జన లక్ష్యంగా కొంత మంది అధికార పార్టీ నాయకులు వృవహరిస్తున్న తీరు కూటమి ప్రభుత్వానికే తలవంపులు తీసుకొచ్చేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మద్యం ఇష్టారాజ్యం వ్యవహారంలో కూటమి పార్టీల పెద్దలు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.,
చూసీచూడనట్లుగా ఎక్సైజ్ అధికారులు..?
ఆత్మకూరు సర్కిల్ పరిధిలో కొన్ని మద్యం షాపుల వారు దర్జాగా తమ దందా సాగిస్తున్నప్పటికీ బాధ్యతగా వ్యవహరించాల్సిన ఎక్సైజ్ పోలీసు అధికారులు పోలిటికల్ లీడర్స్ గుప్పిట్లో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి షాపుల ఏర్పాటు మొదలుకొని నేటి వరకు పలు దుకాణాలు నిబంధనలు తుంగలో తొక్కేసీనా అధికారులు సైతం చూసీచూడనట్టుగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాకుం డా. బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నా కేసులు అంతంత మాత్రం ‘ గానే నమోదు చేస్తున్నారు.
అదే పోలీసు శాఖ అధికాగులు సైతం తమకెందుకు లే అన్నట్లుగా మిన్నకుండిపోతున్నారు. ప్రధాన రోడ్డు పక్కనే తెరచాటున అనుమతులు లేకుండా గదులు ఏర్పాటు చేసి మధ్యపానాన్ని ప్రోత్సహిస్తున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఓపెన్ డ్రింక్ పేరుతో ఎక్కడెక్కడున్న వారిని డ్రోన్ కెమెరాలతో గుర్తించి శిక్షిస్తున్న పోలీసు అధికారులకు రోడ్డు పక్కనే జరుగుతున్న ఈ బాగోతం కనిపించకపోవడం లేదా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే క్రమంలో చిన్నపాటి కిరాణం షాపులకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హెచ్చరికలు జారీ చేసే పోలీసులకు మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు అంశంపై గుర్తుకు రాకపోవడం విస్మయానికి గుర చేస్తోంది.
Also Read చెస్ లో నారా దేవన్స్ ప్రపంచ రికార్డు
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్