రాష్ట్ర వ్యాప్తంగా గత అయిదేళ్ల కాలంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు 1.75లక్షల ఎకరాల భూమిని కాజేశారని డోన్ శాసనసభ్యులు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
ఆయన గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ.. అయిదేళ్ల జగన్ పాలనపై విరుచుకుపడ్డారు.
ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ వైసిపి నాయకులు గద్దల్లా వాలిపోయి కాజేసే వారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో తమ భూమిని కాపాడుకోవడానికి భూ యజమానులు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అనేక మంది నిరుపేద, మధ్య తరగతి ప్రజలు భూ కబ్జాకారుల నుంచి తమ భూములను కాపాడుకోలేక
వారి వేధింపులను తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
భూ కబ్జాదారులకు అనుకూలించే విధంగా గత వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలులోకి వచ్చి ఉంటే సామాన్యుల భూములు.
వైసిపి నేతల పరమయ్యేవని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు చేశామని తెలిపారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
దీని వల్ల భూ యజమానులకు మంచి జరిగిందన్నారు. భూ కబ్జాకారుల నుంచి పేదల భూములను కాపాడేందుకు ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ చట్టం ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో అమలులో ఉందని ఆయన వెల్లడిరచారు. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తోందని పేర్కొన్నారు.
త్వరలోనే ఈ చట్టం అమలులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తరువాత భూ కబ్జా చేసిన వారే ఆ భూమి తమదేనని వారే నిరూపించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
కబ్జా దారులే భూమి తమదేనని నిరూపించేకునే వరకు భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం లేదని ఆయన అన్నారు. గత అయిదేళ్ల కాలంలో వైసిపి నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు, ఇసుక, గనులు వంటి వాటిని కాజేశారని మండిపడ్డారు.
ఆయా శాఖల నుంచి పూర్తి వివరాలు, ఆధారాలతో శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నామని కోట్ల సూర్య అన్నారు. వైసిపి నేతలు కాజేసిన భూముల విలువ..
సుమాను రూ.35 వేల కోట్లకు పైగా ఉంటుందని ఆరోపించారు. జగనన్న కాలనీల పేరుతలో మరో 9వేల ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుక దోపిడీలో సుమారు రూ.10వేల కోట్ల మేర ప్రజాధనం వైసిపి గద్దల జేబుల్లోకి చేరిందని మండిపడ్డారు. గ్రామాలు, పట్టణాల్లో పేదల కోసం నిర్మించే ..
ఇళ్ల కాలనీలు ఎక్కడ రావాలో వైసిపి నేతలే నిర్ణయించే వారని ఆయన అన్నారు. పేదలను బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేయడం,
లేదంటే కబ్జా చేయడం ద్వారా ఆ భూములను సొంతం చేసుకొని అవే భూములను ప్రభుత్వానికి అధికధరకు విక్రయించే ప్రజా ధనాన్ని లూటీ చేసే వారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి
వైసిపి కార్యాలయాల కోసం నామ మాత్రపు లీజు పేరుతో ఏకంగా 33ఏళ్ల కాలానికి భూములను అద్దెకు తీసుకొని రూ.300కోట్లకు పైగా కాజేయాలని ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
భూములను అక్రమంగా కాజేసి ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన వారి నుంచి ఆ సొమ్మును వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
విశాఖపట్టణంలోని రుషికొండపై జగన్ కోసం రూ.500కోట్ల ప్రజా ధనంతో ఒక ప్యాలెస్ నిర్మించారని ఆయన గుర్తు చేశారు. వైసిపి నాయకులు కొండలను మింగి గుండ్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని దీని వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయాలని గుర్తు చేశారు.
చంద్రబాబు నాయకత్వంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకువచ్చామని తెలిపారు.
దీని వల్ల సామాన్యుడు సొంత ఇంటి నిర్మాణానికి తక్కువ ఖర్చుతోనే ఇసుక లభిస్తుందని అదే సమయంలో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
గత అయిదేళ్ల కాలంలో వైసిపి నాయకులు కాజేసిన ఇసుకతో 10లక్షల ఇళ్లను నిర్మించవచ్చని ఆయన అంచనా వేశారు.
రాష్ట్రంలో పంచ భూతాలను మింగిన వైసిపి నేతల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకొన్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.