కొలిమిగుండ్ల మండలం మండల పరిషత్ అధ్యక్షురాలు కారపాకుల నాగ వేణి అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం ..
పాల్గొన్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు,జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్ర బోతుల పాపిరెడ్డి గారు, మండల అభివృద్ధి అధికారి సుబ్బరాజు,మండల తహశీల్దార్ అల్ఫ్రెడ్,మండల అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు…
23 శాఖల అధికారులతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు సమీక్షా సమావేశం….
మండలం లోని పలు సమస్యలను మండల సమావేశం లో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది….
విద్యుత్ శాఖ అధికారిని రెగ్యులర్ అధికారిని నియమించాలని ఎమ్మెల్యే విద్యుత్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ప్రభుత్వ చౌక దుకాణాల వద్ద సరుకుల పట్టి ,ధరల పట్టిక ఏర్పాటు చేయాలని మండల తహశీల్దార్ ఆల్ఫ్రెడ్ కు ఆదేశించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు..
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కారపాకుల నాగవేణి ఆధ్వర్యంలో..
మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బనగానపల్లె నియోజకవర్గం
శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు, జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి గారు, కొలిమిగుండ్ల మండలంలోని అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మండలం పరిషత్ సమావేశంలో మండలంలోని జరుగుతున్న పలు అభివృద్ధి పనులతో పాటు సమస్యలను కూడా ప్రజాప్రతినిధులు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది.
అనంతరం మండల వ్యవసాయ అధికారిని శారదా దేవి ఈక్రాప్ చేసుకున్న వారికి పంట నమోదు పత్రాన్ని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు,
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
జిల్లా పరిషత్ చైర్మన్ ఎరబోతుల పాపి రెడ్డి గారి చేతుల మీదుగా రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్సన్ రామ్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి గారు మాట్లాడుతూ..
బనగానపల్లె నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కార్సన్ రామ్ రెడ్డి గారు నిధులు తీసుకురావడం జరిగిందని అందులో..
కేవలం జలజీవన్ పథకం ద్వారా ఇప్పటికే రెండు విడుదలగా 70 కోట్ల రూపాయలు నిధులు రావడం జరిగిందని నియోజకవర్గంలో పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు.
అలాగే బనగానపల్లె నియోజకవర్గంలో నీ కొలిమిగుండ్ల కొన్ని గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఎద్దడి ఎక్కువగా ఉండేదని అయితే ..
జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని త్వరలోనే ప్రతి ఇంటికి నీటి కుళాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే మండలంలో ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం జరిగిందని చెప్పారు.
ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆదేశాలు
అలాగే గ్రామాల్లో అసైన్మెంట్ ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పి కొంతమంది దళారులు ప్రజలను మభ్య పెట్టడం జరుగుతుందని అది తమ దృష్టికి రావడం జరిగిందని అలాంటి వదంతులను ఎవరు నమ్మవద్దని ఏదైనా రైతులు సాగులో ఉంటే వాటికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
అలాగే గ్రామాల్లో ప్రభుత్వ చౌక దుకాణాల్లో ప్రభుత్వం అందిస్తున్న సరుకులతో పాటు వాటి ధరల పట్టికను ఏర్పాటు చేయాలని .
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
మండల తాసిల్దారు ఆల్ఫ్రెడ్ కు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకు,
కులాలకు, మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని చెప్పారు.
గ్రామాల్లో సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఇంకా పై స్థాయి సమస్యలు ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్..
తన దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు తెలిపారు.
మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల ప్రజలకు ఆర్థిక స్వావలంబనదిశగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని చెప్పారు.
జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా పరుగులు తీస్తుందని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో…
ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకం ద్వారా రైతులకు చెల్లించవలసిన భీమా మొత్తము టిడిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో ..
జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 500 పైచిలుకు కోట్ల రూపాయలు బకాయి ఉండేదని తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత..
రాష్ట్ర ప్రభుత్వ వాటాను చెల్లించడంతో 500 పైచిలుకు కోట్లను రైతులు ప్రయోజనం చెందడం జరిగిందని చెప్పారు.
అందులో భాగంగానే కేవలం ఒక్క బనగానపల్లె నియోజకవర్గం లోనే 70 కోట్ల రూపాయలు మేర రైతులు లబ్ధి పొందడం జరిగిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మండల అభివృద్ధి అధికారి సుబ్బరాజు మండల తాసిల్దార్ ఆల్ఫ్రెడ్ హౌసింగ్ డి.ఈ, ఆర్ అండ్ బి డి .ఈ లతోపాటు మండల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.