స్మశానంలో గుంతలు తీసి పూడ్చే, కాల్చే కాటికాపరుల వృత్తిని గుర్తించి ప్రభుత్వం వెంటనే గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని, వృత్తి దారులందరినీ నాలుగో తరగతి ఉద్యోగులుగా నియమించాలని కోరుతూ సోమవారం స్మశానంలో గుంతలుతీసి పూడ్చే కాల్చే కాటికాపరుల సంఘం ఆధ్వర్యంలో కర్నూల్ నగరంలోని అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ దాకా నల్ల చొక్కా తెల్ల పంచ ఎర్ర కండువా పట్టుడు కర్రతో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ముందు గంటపాటు ధర్నా నిర్వహించారు.
ఎస్. జి కే ఎస్ జిల్లా అధ్యక్షులు బేగరి తిక్కప్ప అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎండి ఆనంద్ బాబు, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, డి విజయమ్మ, ఏపీ డీకేఎస్, ఏపీ సి వి ఎస్ జిల్లా కార్యదర్శులు బి కరుణాకర్, సుమాల అంతోని మాట్లాడారు. చనిపోయినది ఉన్నతుడైన పేదవాడైనా భేదభావం లేకుండా అంతిమ సంస్కారం నిర్వహించే కాటికాపరుల బతుకులను సంస్కరించాలని చిత్తశుద్ధి పాలకులకు లేకుండా పోయిందన్నారు. వృత్తి భద్రత కోసం అసెంబ్లీలో చట్టం చేసి వృత్తిదారులందరినీ నాలుగవ తరగతిఉద్యోగులుగా నియమించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
కార్యక్రమంలో ఎస్ జి కే ఎస్ కౌతాళం మండల కార్యదర్శి వీరేష్, ఎమ్మిగనూరు మండల కార్యదర్శి రాజా రమేష్, మంత్రాలయం మండల కార్యదర్శి సురేష్, కల్లూరు మండల కార్యదర్శి మదన గోపాల్, ఆదోని మండల కార్యదర్శి యువరాజ్, కోసిగి మండల కార్యదర్శి ఫిలిప్, సి బెళగల్ మండల కార్యదర్శి నాగన్న, గూడూరు మండల కార్యదర్శి రవి, కోడుమూరు మండల కార్యదర్శి ప్రకాశం, క్రిష్ణగిరి మండలకార్యదర్శి బజారి, వెల్దుర్తి మండల కార్యదర్శి నాగరాజు, గోనెగండ్ల మండల కార్యదర్శి కరుణాకర్, కర్నూలు మండల కార్యదర్శి వెంకటేష్, ఓర్వకల్లు మండల కార్యదర్శి రామకృష్ణ, పెద్ద కడుబూరు మండల కన్వీనర్ ఈరన్న తదితరులు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు భాస్కర్, యేసు రాజు, మారయ్య, తిమ్మన్న, అంజి, మారెప్ప, ఈశ్వరయ్య, అనిల్ తోపాటు మరో 500 మంది కాటికాపరులు పాల్గొన్నారు.
#కాటికాపరులు #KatiKaparulu