AP : నంద్యాల జిల్లా.. ఓంకారేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు సతీమణి కాటసాని జయమ్మ గారు…..
నిత్యం ప్రజా కోసం కష్టపడే నాయకుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వుండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేసిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి దంపతులు…
నంద్యాల జిల్లా.. బండిఆత్మకూరు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వున్న ప్రముఖ శైవ క్షేత్రమైన ఓంకారేశ్వర స్వామి క్షేత్రంలో..
బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు ఆయన సతీమణి కాటసాని జయమ్మ గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఓంకారేశ్వర క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదని చెప్పారు.
అంతేకాకుండా చ నల్లమల కొండల మధ్య పకృతి సౌందర్యాల మధ్య ఎంతో మహిమాన్విత మైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉందని
వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు రావడం జరుగుతుందని చెప్పారు.
స్వామి వారి ఆలయం ఇక్కడ భక్తులను ఆకట్టుకుంటుందని చెప్పారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పురాతనమైన ఆలయాలను..
అభివృద్ధి చేయాలని సంకల్పంతో రాష్ట్రంలో దశలవారీగా పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
నిత్యం ప్రజల కోసం పరితపించే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అలాంటి వారి కుటుంబం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో..
ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగిందని అలాగే రాష్ట్ర ప్రజలతోపాటు బనగానపల్లె నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగిందని చెప్పారు.
శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి దేవాలయము, ఓంకారం
ఓంకార స్వరూపుడైన కైలాసనాధుడు కొలువు తీరిన అనేకానేక క్షేత్రాలలో ఓంకారం ఒకటి.యుగాల నాటి పౌరాణిక విశేషాలు , శతాబ్దాల చరిత్రకు, తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామా ఓంకారం.
శ్రీ గంగా ఉమా సమేతముగా శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రం ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం.
ప్రశాంతతకు మారు పేరు. మైమరపించే ప్రకృతి సౌందర్యం ఓంకారం సొంతం.
స్వచ్చమైన గాలి,
పచ్చని పరిసరాలు, మొక్కిన వారిని దరి చేర్చుకొనే పరమేశ్వరుని సన్నిధితో సందర్శకులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచివేస్తుంది ఓంకారం,
“ఆర్తులు అందరికి అన్నం” అన్న అవధూత శ్రీ కాశి నాయన మాటను నిజం చేస్తున్న ఆయన భక్త బృందం ఏర్పాటు చేసిన ఆశ్రమం
మరియు అన్న వితరణ కేంద్రం , ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారం ఓంకారం.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
పురాణ గాధ :
క్షేత్రానికి సంబంధించిన పురాణ గాధ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆవిర్భాలతో ముడిపడి ఉన్నది. అందరికీ తెలిసినదే!
సృష్టి ఆరంభంలో సృష్టికర్త బ్రహ్మ దేవుడు, స్థితకారుడు శ్రీ మన్నారాయణుడు నేను గొప్పంటే నేను గొప్ప అన్న వివాదానికి దిగారు.
ఎంతకీ తెగని ఆ వివాదం తీవ్ర స్థాయికి చేరింది.
అప్పుడు వారిరువురి మధ్యన దిక్కులు పిక్కటిల్లేలా ఓంకార నాదంతో ఓక జ్వాలా లింగము ఉద్భవించినది.
“అది ఎవరా ?” అన్న ఆశ్చర్యానికి లోనైనా వారికి ” మీ ఇరువురలో ఎవరైతే నా ఆది
అంతాలలో ఒక దానిని చూసి వస్తారో వారే గొప్ప ” అన్న మాటలు వినిపించాయి.
బ్రహ్మ హంస రూపంలో ఊర్ధ్వ దిశగా ఎగురుతూ వెళ్ళగా, మహా విష్ణువు భూ వరాహ రూపం దాల్చి భూమిని తొలుచుకుంటూ పాతాళం లోనికి వెళ్ళారు.
ఎంతో దూరం వెళ్ళినా ఇరువురు ఆ లింగ ఆది అంతాలను కనుగొన లేక పోయారు.
శివ తత్త్వం భోధపడిన శ్రీ హరి తిరిగి వచ్చి ఓటమిని ఒప్పుకున్నారు.
కానిఅహంభావానికి లొంగిపోయిన విధాత మాత్రం తాను లింగ అగ్ర భాగం చూశానని తెలిపి దానికి సాక్షిగా మొగలి పువ్వును సాక్ష్యంగా తీసుకొని వచ్చారు.
అసత్యం చెప్పిన చతుర్ముఖుని మీద ఆగ్రహించిన లింగ రాజు ఆయనకు భూలోకంలో ఎక్కడా ఆలయం ఉండదని, ప్రజలు ఆయనను పూజించరని, వంత పాడిన మొగలి పువ్వు పూజకు అనర్హమైనదని శపించారు.
ఈ సంఘటన జరిగినది తొలిసారి ఓంకార నాదం ఉద్భవించినది ఇక్కడే కావడం వలన ఈ క్షేత్రానికి “ఓంకారం” అన్న పేరోచ్చినదని స్థానిక నమ్మకం.