- జగన్ పాలనలో టీటీడీ ఆస్తుల దోపిడీపై సి బి ఐ విచారణ చేయాలి
- జగన్ పాలనలో టీటీడీలో అక్రమాలు జరగలేదని నమ్మితే పులివెందులలో రాజీనామా చేసి మళ్ళీ గెలువాలి.
- టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఆధ్యాత్మిక గురువులకే ఇవ్వాలి
- టీటీడీ లడ్డు కల్తీ పై న్యాయవిచారణ జరిపించి ధోషులకు కఠిన శిక్ష వేయాలి
- రాష్ట్రంలోని హిందూ ఆలయాలకు, ఆస్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి…మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
జగన్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఆస్తుల దోపిడీ, అపవిత్రతపై సిబిఐ విచారణ చేయాలని, టీటీడీ లడ్డు కల్తీ పై న్యాయ విచారణ చేసి ధోషులను కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలోని హిందూ దేవాలయాలకు, ఆస్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని, జగన్ పాలనలో టీటీడీలో అక్రమాలు జరగలేదని జగన్ నమ్మితే పులివెందులలో రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలువాలని, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే శ్రీ వేంకటేశ్వరస్వామి పటంతో పులివెందులలో జగన్ పై తాను పోటీకి సిద్ధం అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సవాల్ చేశారు. మంగళవారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో సీనియర్ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా బైరెడ్డి మాట్లాడుతూ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు జగన్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం, ఆస్తుల లూటీ, జరిగిందని, ఎంతో ఘన చరిత్ర, కీర్తి, ఆస్తులు, మహిమలున్న టీటీడీని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాస్తికులు, అన్యమతస్థుల పెత్తనంలో టీటీడీ విలవిలలాడిందని, ఆ వేంకటేశ్వరస్వామియే జగన్ పాలనకు విముక్తి కల్పించి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయిందని, సీఎం చంద్రబాబు వెంటనే టీటీడీపై దృష్టి పెట్టి విచారణ చేయగా అనేక అక్రమాలు జరిగినట్లు గుర్తించారని, హిందువులు పవిత్రంగా భావించే ఏడుకొండల వెంకన్న లడ్డులో కూడా జగన్, ఆయన చుట్టూ ఉన్న అన్యమతస్థుల దోపిడీ గ్యాంగ్ లాలూఛీ పడి కల్తీ కి పాల్పడడం క్షమించరాని నేరం అని బైరెడ్డి అన్నారు.
ర్యాడికల్, నాస్తికుడు, మతం మార్చుకున్న భూమన కరుణాకర్ రెడ్డిని చైర్మన్ గా చేసి, టీటీడీ ఈఓ కు అర్హత లేని తన అనుకూల అధికారికి ఈఓ బాధ్యత అప్పగించి జగన్ టీటీడీలో యదేచ్చగా భక్తుల కానుకలు దోపిడీ చేశారని, అపవిత్రం చేశారని ఆయన ఆరోపించారు. తిరుమలలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయడం దెయ్యాలు వేదాలు వళ్ళించినట్లుందని బైరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ తో పాటు వై వి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డిలు ముఠాగా ఏర్పడి ప్రత్యేక్షంగా, పరోక్షంగా టీటీడీ నిధులు దోపిడీ చేస్తూ, ఆలయ పవిత్రతను దెబ్బతీశారని బైరెడ్డి మండిపడ్డారు.
హిందువుల మనోభావాలు కాపాడాలి
రాష్ట్రంలోని ఆలయాలకు, ఆస్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించి, హిందువుల మనోభావాలు కాపాడాలని బైరెడ్డి కోరారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శిDr. కాకరవాడ చిన్న వెంకటస్వామి, టీడీపీ నాయకులు నరహరి విశ్వనాధ్ రెడ్డి, పాండురంగయ్య, మద్దూరు సర్పంచ్ ప్రదీప్ కుమార్ రెడ్డి, వీరేంద్ర సింహారెడ్డి తదితరులు ఉన్నారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV