జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్

Jr NTR Bammardi Narne Nitin Engagement

Jr NTR Bammardi Narne Nitin Engagement

జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్ … తారక్ ఫ్యామిలీ పిక్ వైరల్

టాలీవుడ్ హీరోలు వరుసగా ఒక్కొక్కరు బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా నాగ చైతన్య, నారా రోహిత్ నిశ్చితార్థ వేడుకలు జరగ్గా.. ఇప్పుడు జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది యంగ్ హీరో నార్నే నితిన్ ఎంగేజ్మెంట్ జరిగింది. హైదరాబాద్‌ లో ఆదివారం జరిగిన నితిన్ నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలతో పాటు పలువురు తెలుగు సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన శివానితో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు నార్నే నితిన్. శివాని పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా తెలుస్తోంది. సీనియర్ హీరో వెంకటేష్ కుటుంబంతో శివాని ఫ్యామిలీకి బంధుత్వం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతికి నితిన్ సోదరుడు అన్న విషయం తెలిసిందే. దీంతో తారక్, నితిన్ పలుమార్లు కలిసి కనిపించారు.

Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!

ఈరోజు జరిగిన ఎంగేజ్మెంట్ వేడుకకు తారక్ ఫ్యామిలీతో అటెండ్ అయ్యారు. లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌ తో సందడి చేశారు. కళ్యాణ్ రామ్, వెంకటేష్ సహా పలువురు సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. త్వరలోనే నితిన్, శివాని వివాహ వేడుక ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని సమాచారం. మరికొద్ది రోజుల్లో మ్యారేజ్ డేట్ ను ఫిక్స్ చేయనున్నారు

ఇక నార్నే నితిన్‌ విషయానికి వస్తే.. ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడే ఆయన. జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్దిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ మూవీతో హీరోగా తొలిసారి తెలుగు సినీ ప్రియులను పలకరించారు. ఆ మూవీ మంచి హిట్ అవ్వడంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా ఆయ్ చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. స్వచ్ఛమైన గోదారి కథతో సందడి చేశారు. సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. తన యాక్టింగ్ తో అలరించారు. వరుసగా రెండు హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. మరిన్ని సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు.

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top