నల్లమల్లలో ప్రయాణం నరకం

The journey in Nallamalla forest is hell

The journey in Nallamalla forest is hell

ఏ ఒక్క వాహనం అడ్డం తిరిగిన వందలాదిమందికి ప్రత్యక్ష నరకమే

దశాబ్దాలుగా సమస్య ఉన్న మారని రహదారి రాత

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం కి ప్రతిరోజు వందల వాహనాల రాక

రక్షణ, భద్రత లేని రహదారులతో వాహనదారుల జీవితాలతో చెలగాటం…

నీటి మీద మూటలుగానే నేతల మాటలు…

శివయ్య… మార్చవా ! మా దారి రాత…

ఘాట్ రోడ్లో డ్రైవింగ్ వేగం తగ్గడంతో ప్రమాదాలు…..

కర్నూలు నుంచి గుంటూరుకు ఆత్మకూరు నుంచి వెల్లే రహదారి దశాబ్దాలుగ ఉన్న సమస్య నల్లమల్ల అటవీ ప్రాంతంలోని రోళ్లపెంట ఘాట్ రోడ్డులో..

ఏ ఒక్క వాహనం అడ్డం తిరిగిన వందలది మంది ప్రయాణికులకు వాహనదారులకు నల్లమల్ల ప్రయాణం నరకంగా మారిందని చెప్పవచ్చు..

అసలు ఎందుకు ఈ రోడ్డును జాతీయ రహదారుల శాఖ రాష్ట్ర రహదారుల శాఖ లు పట్టించుకోవడం లేదు కారణాలు ఏమి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల నిధులు..

దుర్వినియోగం చేస్తున్నారే తప్ప సరైన మార్గం చూపడం లేదు లోపాలు ఎక్కడున్నాయి ప్రయాణికులకు వాహనాదారులు ఘాట్ రోడ్లో పడుతున్న ఇబ్బందులపై రాకపోకలపై ప్రత్యేకం

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి ప్రతిరోజు వందల వాహనాలలో భక్తాదుల కు పర్యాటకులు ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది నల్లమల్ల ఘాట్ రోడ్డు మీద గ ప్రయాణం కొనసాగాల్సి ఉంది.

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానికి వెళ్లాలన్న ఈ ఘాట్ రోడ్ లోనే ప్రయాణం సాగించాలి ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఇదంతా కేవలం రక్షణ భద్రత లేని రహదారులతో వాహనదారుల జీవితాలతో చెలగాటం మారడం అని చెప్పవచ్చు మరోవైపు ఈ మార్గంలో..

రైతులు పండించిన గిట్టుబాటు ధర అమ్మకాలు జరుపుకోవాలని గుంటూరు మార్కెట్ యార్డ్ కు మిర్చి లోడ్లు అధికంగా వెళ్తూ ఉంటాయి.

మరోవైపు రాష్ట్రంలోని అసెంబ్లీ సమావేశాలకు రాయలసీమ నుంచి ప్రజా ప్రతినిధులు ఎంపీలు మంత్రులు ఈ మార్గం వైపే వెళ్లాల్సి ఉంది.

ఘాట్ రోడ్లో ప్రయాణం చేయాలంటే భయంతో కొనసాగే విధిగా మారిందని చెప్పవచ్చు నేతలు మాత్రం నీటి మీద మాటలుగా చెప్పుకుంటూ..

ముందుకెళ్తున్నారే తప్ప రహదారిలో ఉన్న సమస్య ఎవరు స్పందించడం లేదు ప్రస్తుత నల్లమల్ల ఘాట్ రోడ్డు లో ఏ క్షణం అయినా జరిగే ప్రమాదాలను ..

దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు వాహనదారులు గంటల తరబడి ఘాటు రోడ్డు లోనే వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని చెప్పవచ్చు.

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

అక్కడ కనీసం అటవీశాఖ ఆధ్వర్యంలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేక పోతున్నారు.

ట్రాఫిక్ అధికంగా కావడంతో రోడ్డుకు ఇరువైపులా వెడల్పు లేకపోవడంతో ఇరుకుగా ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

గత రెండు సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా నుంచి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ కు వెళ్తున్న ఓ రైతు లారీ టైర్ పగిలి లోయలో పడి మృతి చెందిన సంఘటన ఈ ప్రాంతంలో ప్రజల్ని కలిసి వేసింది.

కర్నూలు , ప్రకాశంజిల్లాల సరిహద్దు రోళ్లపెంటఘాట్

గత సంవత్సరంలో ఓ భారీ వాహనం ఇనుప గడ్డిలతో వెళ్తున్న కొండకు ఢీకొని ఆ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు ఇదంతా కేవలం 5.కి.మీటర్ల.పరిధిలోని జరుగుతుంది.

కర్నూలు ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని రోళ్లపెంట ఘాట్ రోడ్లో ఈ ట్రాఫిక్ జామ్ అధికంగా ఏర్పడుతుంది రెండు కొండల మధ్య రోడ్డు ఇరుకుగా ఉండడంతో..

ప్రాణాంతకమైన మలుపులు ఒకవైపు పెద్ద ఎత్తున లోయలు మరోవైపు కొండను ఢీకొనే పరిస్థితి నెలకొంటుంది ఏమాత్రం జాగ్రత్తగా డ్రైవరు వెళ్లకపోతే..

ప్రాణాలు గాలిలో దీపం లాగానే కలిసిపోయే విధంగా ప్రమాదాలు పొంచి ఉన్నాయి నల్లమల్ల ఘాట్ రోడ్లో ఎందుకు అభివృద్ధి సాధన ఇవ్వకుండా రోడ్డు మార్గాలను అడ్డుకుంటున్నారు.

దీనికి కారణాలు ఏమిటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండే వన్య ప్రాణులే ముఖ్యమా.. లేక ప్రయాణికుల ప్రాణాలు ముఖ్యమా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఆత్మకూరు పట్టణం నుంచి ,27.కి.మీటర్ దగ్గర రెండు జిల్లాల సరిహద్దుల వివరాలను ఉన్న ప్రదేశంగా ప్రభుత్వాలు గుర్తించారు.

అయితే దేశంలో అన్ని చోట్ల జాతీయ రహదారుల పేరుతో బాగా అభివృద్ధి అవుతున్నప్పటికీ కేవలం నల్లమల్ల అటవీ ప్రాంతంలోనే రహదారి మార్గం అభివృద్ధికి నోచుకోవడం లేదు.

అరుదైన లోయలు ప్రాణాంతకమైన మలుపులు ఉండడంతో ప్రయాణం ముందుకు వెళ్లాలంటే నరకయాతన గ నే కొనసాగించాల్సి ఉంది

  • శివయ్య మార్చావా..మా దారి రాత…?

ప్రతి సంవత్సరం నీ పేరు చెప్పి భక్తాదులకు మౌలిక సదుపాయాలు రహదారులు మరమ్మతులు కల్పిస్తామని కోట్లాది రూపాయల నిధులను..

దుర్వినియోగం చేస్తున్నారే తప్ప శాశ్వతమైన రహదారులు వేయడం లేదు కాసుల కోసం కక్కుర్తి పడే కాంట్రాక్టర్లు ఆదాయం కోసం ..

ఆశపడే అధికారులు ఉన్నంతవరకు ..శివయ్య.. మార్చావా మా దారి రాత అంటూ పలువురు భక్తాదులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహాశివరాత్రి ఉగాది ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖ శ్రీశైలం శైవ క్షేత్రానికి దర్శన భాగ్యం కోసం వేలది సంఖ్యలో తరలి వస్తుంటారు.

ప్రతిరోజు వందలాది వాహనాల రాకపోకలు రావడం మరియు ఎంతో ప్రత్యక్ష పరంగా ప్రయాణికులు ముందుకు సాగడం లేదు .

ఘాట్ రోడ్లలో జరిగే ప్రమాదాలకు గంటల తరబడి ప్రయాణికులు అక్కడే వేచి ఉండాల్సింది రక్షణ భద్రత లేని వాహనదారుల జీవితాలతో చెలగాటమాడుతున్నది.

ఎవరు అనే విషయం ప్రశ్నార్థకంగానే మిగిలిందని చెప్పవచ్చు.

ఘాట్ రోడ్లో డ్రైవింగ్ వేగం తగ్గడంతో అధిక ప్రమాదాలు

ఘాట్ రోడ్లో డ్రైవింగ్ వేగం తగ్గడంతో ఇలాంటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు.

ముఖ్యంగా వాహనదారులు కొండ కోనల్లో గుట్టలుగా వేగంగా వెళ్తేనే ముందుకు వాహనం వెళ్తుంది వాహనానికి గేరు మార్చే సమయంలో..

పొరపాటున ఆలస్యం చేస్తే వెంటనే బండి వెనక్కి వచ్చి రోడ్డుకు అడ్డంగా నిలిచే ప్రమాదం ఘాట్ రోడ్ లో ఉంది ఘాట్ రోడ్లో భారీ వాహనాలను..

రోడ్లో భారీ వాహనాల నిషేధం

నిషేధం చేస్తే తప్ప ట్రాఫిక్ జామ్ చేయడం ఎవరి తరం కావడం లేదు గతంలో ఇలాగే ఎన్నో ప్రమాదాలు జరిగిన అధికారులకు చలనం లేకుండా పోయింది.

కేవలం జాతీయ రహదారి గుర్తింపు తప్ప అభివృద్ధి శూన్యంగా మారిందని చెప్పవచ్చు రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తుతో ముందుకు వెళుతున్న..

ప్రభుత్వం కేంద్ర కేంద్ర ప్రభుత్వం రహదారులు వేసే విధంగా కోట్లాది రూపాయల నిధులను కేటాయిస్తున్నారు .

కర్నూల్ జిల్లా నుంచి అమరావతి వరకు నేషనల్ హైవే రహదారి పనులు చేపట్టాల్సి ఉంది అయితే ఈ పనులు కేవలం ఆలస్యంగానే కొనసాగుతున్నాయని..

మరికొందరు వాహనదారులు వాపోతున్నారు ఘాట్ రోడ్డులో జరిగే ప్రమాదాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా ఉంచాల్సినప్పటికీ ఆచరణ ఏమీ కనిపించడం లేదు

నీటి మీద మూటలుగానే…నేతల మాటలు…

కేంద్ర రాష్ట్రాలను పరిపాలన చేసే ముఖ్యమంత్రులు రాజ్యసభ సభ్యులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు తరచుగా ఇదే ఘాట్ రోడ్లో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

ఘాట్ రోడ్ లో ఉన్న సమస్యలపై ఏ ఒక్క ఎమ్మెల్యే ఘాట్ రోడ్ లో ఉన్న స్థితిగతులపై అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడే నాధుడు కరువయ్యారు.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

నీటి మీద మూటలుగానే నేతల మాటలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు దశాబ్దాల కాలం నుంచి ఘాట్ రోడ్లో ముందుకు సాగని ప్రయాణంగానే కొనసాగుతుంది.

కోట్లాది రూపాయలు నిధులు ఖర్చు చేసిన ఆ నిధులు దుర్వినియోగమే తప్ప చేసిందంటూ ఏమి లేదు ఇప్పటికైనా ..

సంబంధించిన శాఖల అధికారులు స్పందించి నల్లమల్ల ఘాట్ రోడ్లో ప్రయాణికుల వాహనదారుల కష్టాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వేగవంతంగా జాతీయ రహదారుల పనులు కొనసాగించాలని నల్లమల్ల అటవీ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top