ఆరోగ్యానిచ్చే ఆహారపు పంటగా జొన్న

Jonna Panta - sorghum

Jonna Panta - sorghum

  • ఆరోగ్యానిచ్చే ఆహారపు పంటగా..జొన్న
  • మధుమేహ వ్యాధితో బాధపడే వారికి అనువైన ఆహారం..జొన్న

2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ గుర్తించింది. ఇందులో భాగంగా భారత మరియు తెలంగాణ ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను వేపట్టాయి. జొన్న మరియు చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడానికి కృషి చేస్తుంది. ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లు , పౌల్ట్రీ పరిశ్రమలో దాణాగా, బయో ఇథనాల్ తయారీకి, పెరిగిన మార్కెట్ డిమాండ్ మరియు మార్కెట్ ధర అశాజనకంగా ఉండటం వల్ల కూడా రైతులు అన్ని కాలాల్లో జొన్నని అధిక విస్తీర్ణంలో సాగు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. గత అయిదు సంవత్సరాలలో తెలంగాణలో క్రమంగా జొన్న విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు పైగా జొన్న సాగవుతుంది (వ్యవసాయశాఖ, 3023- 24) ప్రధానంగా అదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్ మరియు వికారాబాద్ జిల్లాల్లో జొన్న అధికంగా పండించబడుతుంది.

Also Read సిద్దేశ్వరం అలుగు – ఆంధ్రప్రదేశ్ కు వెలుగు

తెలంగాణలో జొన్న 1,04,000 టన్నులు ఉత్పత్తి, 1868 కిలోలు/హెక్టారుకు ఉత్పాదకత సమోదైనది (ఇండియాస్టాట్ 21923-24) ఇటీవలి కాలంలో ఆరోగ్యానిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాదరణ పొందింది. జొన్నలో మాంసకృతులు, పీచు పదార్దములు, థయామిన్, రైబోఫ్లోవిన్, ఫోలిక్ ఆసిడ్ కాల్సియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్ మరియు యాంటీ అక్సిడెంట్లు అధిక శాతంలో ఉంటాయి. ఇది గుండె సమస్యలు, స్థూలరామం మరియు కీళ్ళ నొప్పులు నియంత్రించడానికి సహాయపడుతుంది. జొన్నలోని దక్కిరలు (గ్లైసెమిక్ ఇండెర్స్ HB) వరి బోని చక్కెర్ల కంటే (గ్లైసిమిక్ ఇండెక్స్ 73) నెమ్మదిగా జీర్ణమవడం వలన, మధుమేహ వ్యాధితో బాధపడే వారికి అనువైన ఆహారం. జొన్నలో అధిక దిగుబడినిచ్చే సంకర మరియు మెరుగైనరరాలు అభివృద్ది చేయబడ్డాయి.

దీనికి తోడు వివిధ కాలాలకు అనుకూలమైన సాంకేతిక పద్దతులను అభివృద్ధి చేయడం వల్ల జొన్న ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అందువలన, ఆధునిక పద్ధతిలో మేలైన సాగు మెళకువలు పాటించడం వల్ల యాసంగిలో జొన్నతో అధిక దిగుబడులుపొందడానికి అవకాశం ఉంది జొన్నలో సాగుకు అనువైన పచ్చ జొన్న, తెల్ల జొన్న, తీపి జొన్న, ఎర్ర జొన్న గడ్డి జొన్న మొదలైన రకాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ హైద్రాబాద్ మరియు స్ట్రా జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారిచే అధిక దిగుబడులను ఇచ్చే మేలైన రకాలు మరియు హైబ్రీడ్స్ ఎంపిక చేసుకొని మేలైన యాజమాన్య చర్యలు చేపట్టి అధిక ఆదాయాన్ని పొందవచ్చును. అనువైన రకాలు: జొన్న పంట సాగు చేసేటప్పుడు తేమను నిలుపుకొనే బరువైన నేలంలో ఒకటి రెండు తడులు ఇచ్చే సదుపాయం ఉంటే హైబ్రిడ్జ్లను ఎంచుకొని అధిక దిగుబడులను సాధించవచ్చు. తేలిక పాటి నేలల్లో అయితే సూటి రకాలను ఎంచుకోవడం మంచిది.

డా. కె. శేఖర్, డా. కె. సుజాత, వ్యవసాయ పరిశోధనా స్థానం తాండూరు.. సెల్ 9032128124

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

#sorghum #jonna #jonnalu #siridhanyalu #jonnapindi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top