- మరోమారు మోసం చేసేందుకే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన
- నాస్తికులు, అన్యమతస్థులను టీటీడీ చైర్మన్లుగా నియమించి అపవిత్రం చేసిన జగన్
- జగన్ సుంకులమ్మ కొరడా ( సెలకాల) లతో కొట్టుకున్నా చేసిన పాపం పోదు
- కల్లూరు శ్రీవీ రభద్రస్వామికి బైరెడ్డి సోదరులు ప్రత్యేక పూజలు
- వైఎస్సార్ జిల్లా ను కడప జిల్లా గా నే కొనసాగించాలి
- జగన్ సుంకులమ్మ కోరాడతో బట్టలు ఇప్పి కొట్టుకున్నా తిరుమలలో చేసిన పాపం పోదు
మరోమారు తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులను మోసం చేసేందుకే వైసీపీ అధినేత వై ఎస్ జగన్ నేడు, మరునాడు తిరుపతి పర్యటన అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా ఓల్డ్ కల్లూరు శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్బంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డును కల్తీ చేసి, ఆలయ పవిత్రతను దెబ్బతీసి, వెంకన్న భక్తుల ఆగ్రహానికి గురైన జగన్, ఆయన గ్యాంగ్ మళ్ళీ సమస్యను పక్కతోవ పట్టించేందుకే రెండు రోజుల తిరుమల పర్యటన జగన్ చేస్తున్నాడని విమర్శించారు. రాయలసీమలోని గ్రామాల్లో ఎవరైనా తప్పుచేస్తే చేసిన తప్పుకు గ్రామ ప్రజల సమక్షంలో సుంకులమ్మ కొరడా ( సెలకాల ) తో గ్రామ రచ్చబండ వద్ద కొట్టుకునే సంప్రదాయం అని, వై ఎస్ జగన్ కూడా సుంకులమ్మ కోరాడతో బట్టలు ఇప్పి కొట్టుకున్నా తిరుమలలో చేసిన పాపం పోదని బైరెడ్డి అన్నారు.
Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
వేంకటేశ్వర స్వామి కడపలో ముందుగా దర్శించుకొని తిరుమల వెళ్ళే సంప్రదాయం ఉందని, కడప అంటే తిరుమల వెంకన్న స్వామికి గడప లాంటిదని అలాంటి కడపను తొలగించి.. వైఎస్సార్ జిల్లా అని వాళ్ళ నాన్నపేరు పెట్టుకోవడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే నని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే కలుగ జేసుకొని వై ఎస్ ఆర్ కడప జిల్లా పేరును తొలగించి మొదటి నుంచి ఉన్న కడప జిల్లాగానే కొనసాగించేలా ఆదేశించాలని బైరెడ్డి విజ్ఞప్తి చేశారు.
తిరుమల వెంకన్న లడ్డును కల్తీ చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీసి, హిందూ సాంప్ర దాయాలను పాడు చేసినందుకు నిరసనగా శ్రీ వీరభద్రస్వామి ఆలయ శుద్ధి, పచ్చతాప దీక్ష పూజలు చేశామని బైరెడ్డి వివరించారు. వై ఎస్ జగన్ తో పాటు ఆయన అన్య మతస్థులు, నాస్తికుల గ్యాంగ్ తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో పవిత్రమైన లడ్డు కల్తీ చేసిన ఘోర తప్పిదాన్ని మళ్ళీ జరుగకుండా ఉండేలా ప్రతి ఆలయంలో పచ్చాతప పూజలు చేయాలని బైరెడ్డి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లూరు లక్ష్మిరెడ్డి, వేముల శ్రీధర్, బీజేపీ నాయకులు నాగరాజు, తదితరులు పచ్చాతాప పూజల్లో పాల్గొన్నారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV