తప్పు నీదే..జగన్

ys-jagan-mohan-reddy.jpg

తప్పంతా జగన్ దే .. ఓ అభిమాని ఆవేదన..

పాలన మీద దృష్టి పెట్టి పార్టీని గాలికి వదిలేశారు.. అదే ఈ ఘోర ఓటమికి ప్రధాన కారణం..
ప్రభుత్వము ప్రజల మధ్య వారధి లా వాలంటీర్లు ఉన్నారు … ఏ సమస్య వచ్చినా వాళ్ళే చూసుకుంటారు అనుకున్నావ్… నాయకుల్ని పట్టించుకోలా … ఆఖరుకి MLA, MP లను కూడా వదిలేస్తే పార్టీ ఎలా నిలబడుతుంది?
ప్రజలు సమస్యలు వస్తే నాయకుల దగ్గరకు రావాలి MLA ల దగ్గరకు రావాలి… అప్పుడే వాళ్ళ మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది…. ఎలక్షన్ టైం లో ఓట్లు వేయించ గలుగుతారు…
2019 లో నీ కోసం లక్షల లక్షలు ఖర్చుపెట్టిన నాయకులు ప్రభుత్వము వచ్చాక చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటే 4 యేళ్లు డబ్బులు వేయకుండా DBT అని పంచేస్తే .. ఇంక నాయకులు ఏం బాగుపడతారు… ఏ స్థైర్యంతో ముందుకు వెళ్తారు ?
మొన్న ఎన్నికల్లో ఓట్ వేద్దాం వేయొద్దాం అనే కసి ఒక్కడిలో కూడా కనపడలేదు నాకు…. రాజధాని ఏరియా అవ్వడం వల్ల నాకు అలా అనిపించింది ఏమో అనుకున్నా .. కాని అన్నిచోట్లా అలాగే ఉందని నిన్నే తెల్సింది…
మద్యం బాలేదని మన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు… ఆ డిస్లరిస్ అన్ని నువ్వే తీసుకొచ్చావు అని టీడీపీ వాళ్లు ప్రచారం చేస్తుంటే .. ఒకటి ప్రెస్ మీట్ పెట్టీ క్లియర్ గా అయినా చెప్పాలి… లేకపోతె మనం ఎలాగూ మధ్య నిషేధం చేయలేకపోతున్నాం కాబట్టి ఓల్డ్ బ్రాండ్స్ అయినా తీసుకు రావాలి… అంతేగానీ అలా వదిలేస్తే దాని డ్యామేజ్ ఇలాగే ఉంటుంది….
100 లో 70 మంది మందు తాగే వాళ్ళే …
100 లో 60 మందికి ఇసుక కావాలి
100 లో 60 మందికి ల్యాండ్స్ ఉన్నాయి
ప్రతీ ఒక్కరికీ కరెంట్ బిల్స్ లో ఎక్సట్రా చార్జీలు వస్తున్నాయి
ఇవన్నీ ప్రధాన సమస్యలు అన్ని తెల్సినప్పుడు…ఒక్క దాన్ని కూడా అదుపు చేయకుండా … టీడిపి వాళ్లు అలాగే వాగుతారు లే జనం పట్టించుకోరు అని వదిలేసావ్… కానీ జనం పట్టించుకున్నారు… అదే ఈ ఎలక్షన్ రిజల్ట్ ..
సోషల్ మీడియా లో పేజస్ మొత్తం నెగిటివిటి ఉంది …16,17 యేళ్ళ పిల్లోడు కూడా జగన్ గురించి ఏమీ తెలీకుండా టీడిపి, జనసేన వాళ్లు చెప్పేది నిజం అనుకుంటున్నారు…మనం కూడా పేజెస్ మెయింటెయిన్ చెయ్యాలి అని నెత్తి నోరు బాధుకున్న ఒక్కడు కూడా పట్టించుకొలా…
గత 3 సవంత్సరాల నుండి అన్ని ఊర్లు తిరిగి పార్టీని బలిష్టం చేసుకున్న లోకేష్ లాంటి వాడి మీద మెజార్టీ కులం వారిదే అని చెప్పి కనీసం ముక్కు మొహం కూడా తెలియని ఆమెను నుంచో పెడితే ఎలా గెలుస్తుంది ….
సామాజిక సమీకరణలు అని చెప్పి లావు లాంటి మంచి లీడర్స్ వెళ్లిపోతుంటే పట్టించుకోకుండా వదిలేసావ్…
నా మొహం చూసే ఓట్లు వేస్తారు వాళ్ళతో పనేంటి అనుకున్నావ్….నీ మొహం చూసి 40% ఓట్లు వచ్చినియ్…మనం గెలవాలి అంటే అవి సరిపోవు అని అర్థమైంది గా … నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మనది ఏముందిలే జగన్ ని చూసే వేస్తారు అని చాలా చోట్ల పార్టీని పట్టించుకోవడం మానేసారు…
ప్రతీ ఒక్కరూ PK వెనకాల చాలా బలమైన కులం ఉంది, సినిమా పరం గా కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అని మర్చిపోయి చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు… ప్రతీ సభలో వాడి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు..అది వాళ్ళకి అసలే నచ్చలేదు… PK కూడా ఈసారి ఎమోషనల్ గా మాట్లాడుతు వాళ్ళ కులం వాళ్లని బాగా కనెక్ట్ చేసుకున్నాడు…ఏదో జనసేన 21 సీటల్లో గెలిచింది అని వాళ్ళ ఓట్ పర్సంటేజ్ 8 అని చెప్తున్నారు కానీ.. నాకు తెలిసి 12 to 14% ఓటింగ్ యాడ్ అయి ఉంటుంది కూటమికి……
మన పార్టీ ఓడిపోయింది అని నువ్వు ఎమోషనల్ అవ్వాల్సిన పని లేదు … నువ్వు మంచే చేయాలని చూసావ్…అది చెప్పుకోవడంలో విఫలం అయ్యాం …
ఈ 5 యేళ్లు టీడిపి వాళ్లు వేసిన బురద కడుక్కోవడమే సరిపోయింది…ఇంకా మన మంచి ఎక్కడ ప్రచారం చేయగల్గుతాం !
నువ్వు మా ధైర్యం… నువ్వు నిలబడు నీ వెనకాల మేము నిలబడతాం…. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యం అని అందరికీ తెలుసు… మొదటి 2 యేళ్లు మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా జనం పట్టించుకోరు… తర్వాత వాళ్ళకే తెలుస్తుంది నీ పాలన విలువ ఏంటో… పార్టీ మీద దృష్టి పెట్టు… ఎప్పటికి పార్టీ పునాదులు లాంటి కార్యకర్తలను, నాయకులను బేఖాతరు చేయకూడదని గుర్తు ఉంచుకో…మా ప్రాణం పోయే వరకు నీకోసమే నిలబడతాం …. జై జగన్ ..జోహార్ వైయస్ఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top