నంద్యాల జిల్లా దొర్నిపాడు మండల కేంద్రం లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం లో ముఖ్య అతిధిగా ఆళ్లగడ్డ శాసన సభ్యులు భూమా అఖిల ప్రియ పాల్గొన్నడం జరిగింది. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ .. తెలుగుదేశం వస్తేనే మన భవిష్యత్తు లు బాగు పడతాయని నమ్మి ఓటేశారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ,గత ప్రభుత్వంలో వైసిపి నాయకులు , అన్ని శాఖల అధికారులు కావచ్చు ,ముఖ్యంగా పోలీసులను అడ్డం పెట్టుకొని అందరిని ఇబ్బందులు పెట్టీ పైశాచికా ఆనందం పొందారని దుయ్యబట్టారు
ఒక్క ఛాన్స్ అని రైతులకు నెరవేర్చలేని అపద్దపు హామీలిచ్చి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాడు ఈ జగన్ మోహన్ రెడ్డి. కానీ టీడీపి అధికారంలోకి వచ్చి 100 రోజులు మాత్రమే ఈ 100 రోజుల్లో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేందుకు సీఏం చంద్రబాబు ప్రత్యెక కృషి చేస్తున్నారని , టీడీపి అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో 100 మంచి పనులు చేసామని అన్నారు.
ఎన్నికల ముందు హామి ఇచ్చిన ప్రకారం ఈ 100 రోజుల్లో పెన్షన్ ను పెంచాం , మెగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేశాం , భూ హక్కు చట్టాన్ని రద్దు చేశాం, గత ప్రభుత్వాలు రైతును రాజు అని చెప్పి నమ్మించి కనీసం రైతు రైతులా చూసిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో మన రాయలసీమ లో ఎంతో మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో రీ సర్వే చేసిన భూములను రిజిస్ట్రేషన్ లు చేయకుండా ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.
ఈ సారి మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింటే గనక ప్రజల ఆస్తులపై కాదు ప్రజల మొహాలపై కూడా అతని స్టిక్కర్ వేయించుకునే వాడు. వరదల్లో చిక్కుకున్న వారినీ కాపాడేందుకు నిత్యం గ్రామ స్థాయి టీడిపి కార్యకర్త నుండి స్టేట్ సీఎం వరకు సహాయ చర్యల్లో పాల్గొనడమే కాకుండా ఎవరికి తోచినంత వారు సహాయ సహకారాలు అందించారు. కానీ వైసిపి నేతలు అటువంటి సహాయక చర్యల్లో పాల్గొని ప్రజల బాగోగులు చూడకుండా కేవలం సీఎం , డిప్యూటీ సిఎం ల గురించి మాట్లాడేందుకే వైసిపి నాయకులు ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి వరద బాధితులకు రూ. 1 కోటి ప్రకటించారు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
ఆళ్ళగడ్డ నియోజవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి
ఇదే దొర్నిపాడు మండలంలో రైతులు సాగు నీరు లేక ఎంత ఇబ్బంది పడ్డారో నేను దగ్గరుండి చూసా. 2 రోజులు పాటు కాలువ వెంట తిరిగి ఇదే చోట కలెక్టర్ తో కొట్లాడి మరి నీరు తెప్పించా. ఆనాడు రైతులను అంత హీనంగా చూశారు వైసిపి నాయకులు. కానీ నేను నేడు అదే రైతులను స్టేజ్ పైనా పక్కన కూర్చోబెట్టుకున్నా. ఆళ్ళగడ్డ ను చాల అభివృద్ధి చేయాలి కాబట్టి కూర్చుంటే పనులు కావు కాబట్టి నేను పరిగెత్తుతా అధికారులను పరిగెత్తిస్తా అభివృద్ధి చేసి చూపిస్తా. గత ప్రభుత్వంలో గ్రామ సర్పంచ్ లు ఎన్ని అవమానాలు భరించారో , ఎన్ని ఇబ్బందులూ ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు. అవన్నీ సీఏం చంద్రబాబు గమనించారు కాబట్టే వారి హోదా వారికి కల్పిస్తూ గ్రామాల్లో రోడ్లు , వసతులు ఇలా అభివృద్ధి చేసేందుకు దాదాపు 2000 కోట్లు విడుదల చేశారు. ఈ డబ్బులు వచ్చిన వెంటనే ఆళ్ళగడ్డ నియోజవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి దిశగా పరిగెత్తిస్తా.
గతంలో జగన్ మోహన్ రెడ్డి సిఎం గా ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పి మనకు మనకే గొడవలు సృష్టించారు. కానీ నేడు చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఎక్కడో విజయవాడ లో వరదలు వస్తె ఇక్కడ ఆళ్ళగడ్డలో చందాలు వేసుకుని ప్రతి ఒక్కరినీ సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి అందరినీ ఒక్కటి చేశారు. అది చంద్రబాబు కు జగన్ మోహన్ రెడ్డి కి ఉన్న తేడా .. తిరుమల లడ్డు ఎంతో పవిత్రంగా భావించి కళ్ళకు అద్దుకుని తినే ప్రసాదంపై ఈ వైసిపి నాయకులు ఇంత నీచమైన పనులు చేశారు. నేడు చంద్రబాబు నాయుడు గారు ఆ లడ్డుపై ఎవరెవరు ఇలాంటి అపవిత్రత కు ఒడిగట్టారో ప్రతి ఒక్కరి పై తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
మైనారిటీలకు హజ్ యాత్రకు కావచ్చు , దుల్హన్ పథకం కావచ్చు , తోఫా కావచ్చు ఇవన్నీ రద్దుచేసి మైనారిటీలకు ద్రోహం చేశారు ఈ వైసీపీ నాయకులు రద్దు చేసిన వాటన్నింటినీ మళ్ళీ అమలులోకి తెస్తాం ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటాం. ఇది చెప్పే ప్రభుత్వం కాదు చేసీ చూపే ప్రభుత్వం అని ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న ఉచిత గ్యాస్ సిలిండర్లు ను ఈ దీపావళి కి అందజేస్తాం. మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను కూడా తొందరలోనే అమలు చేస్తాం.
ఇది మంచి ప్రభుత్వం ” స్టిక్కర్లను ఆవిష్కరించిన భూమా అఖిల ప్రియ
మన డిప్యూటి సీఎం పవణ్ కళ్యాణ్ ను గతంలో వైసిపి నాయకులు ప్రెస్ మీట్ లు పెట్టీ తిట్టి , చివరికి కుటుంబ సభ్యుల ను సైతం దూషించడమే పనిగా పెట్టుకొనే వారు వైసిపి మంత్రులు కానీ వైసిపి రౌడీల నుంచి ప్రజలను , రాష్ట్రాన్ని కాపాడేందుకు టీడీపి తో పొత్తు పెట్టుకొని నేడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరిగెత్తిస్తూ ఒక సామన్యుడిలా ప్రజల కష్టాలను తెలుసుకొని పరిష్కరించే గొప్ప వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోండి నేను కూడా ఇచ్చిన హామిలన్ని అతి త్వరలోనే నెరవేరుస్తా…నంతరం “ ఇది మంచి ప్రభుత్వం ” స్టిక్కర్లను భూమా అఖిల ప్రియ ఆవిష్కరించి.. ఇంటింటికి తిరిగి వంద రోజుల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి స్టిక్కర్లను అతికించడం జరిగింది.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV