బైక్ పై హెల్మెట్ తప్పనిసరి..ఎస్పీ

Helmet is mandatory on bike..sp

Helmet is mandatory on bike..sp

బైక్ పై హెల్మెట్ ధరించడం తప్పనిసరి ఎస్పీ

బైక్ పై ప్రయాణించే ప్రతిసారి హెల్మెట్ ధరించడం తప్పనిసరి….హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యం చేరండి , వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి….

నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS

నంద్యాల జిల్లా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న వాటిలో ఎక్కువగా ద్విచక్ర వాహనాల పై ప్రయాణిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారని ఎస్పి రఘువీర్ రెడ్డి అన్నారు.

అతివేగం మరియు అజాగ్రత వలన ,రోడ్డు భద్రత ,ట్రాఫిక్ నిభందంలు పాటించక ముఖ్యంగా హెల్మెట్ దరించక పోవడం వలన ప్రమాదాలకు గురౌతూ ప్రాణాలు కోల్పోతున్నారు.

గత నెల 26-06-2024 న తాండావ యోగేష్ V/S స్టేట్ ఒఫ్ ఏ. పి హై కోర్ట్ ఉత్తర్వుల మేరకు ఇకపై ద్విచక్ర వాహనదారులు వాహనంను

హై కోర్ట్ చీఫ్ జస్టీష్ ధర్మాసనం ఆదేశాలు..

నడుపు నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని గౌరవ హై కోర్ట్ చీఫ్ జస్టీష్ ధర్మాసనం ఆదేశాలు జారీచేశారు.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన యాక్షిడెంట్ డేటా ఆదారంగా AP లో 3703 కేసులలో 3042 మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలలో చనిపోయారని వీరందరూ

కేవలం హెల్మెట్ దరించకపోవడం వలన ఎంతో మంది పౌరులు చనిపోయారని దిగ్బ్రంతి వ్యక్తం చేశారు.

CC ఫుటేజ్ ద్వారా వాహనాల రద్దీ

విజయవాడ లాంటి పెద్ద పట్టణాలలో CC ఫుటేజ్ ద్వారా వాహనాల రద్దీని గౌరవ హైకోర్ట్ పరిశీలన చేయగా చాలా తక్కువ మంది హెల్మెట్ ను వాడుతున్నారని అభిప్రాయం

Buy a good pen drive now

కావున ఇకపై ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని పోలీసు మరియు రవాణా శాఖను ఆదేశిస్తు నిభందనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీచేయడం జరిగింది.

స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు జూలై 04-07-2024 నుండి 31-07-2024 వరకు పోలీసులు,రవాణా శాఖ అదికారులు,లాయర్లు,స్వచ్చంద సంస్థలు

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలి

ప్రజలకు హెల్మెట్ వాడటంవలన కలుగు ప్రయోజనాలను వారికి తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అందుకు లీగల్ సర్వీస్ స్టేట్ అథారిటీ పర్యవేక్షించాలి .

పోలీసు ,రవాణా అదికారులు హెల్మెట్ ధారణపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మరియు అన్నీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ప్రమాదలపై అవగాహన కల్పించాలి ఎస్పీ ..

నంద్యాల జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ SHO లకు ఇన్స్పెక్టర్ లు ,DSP లు కోర్టు ఆదేశాలను తప్పక పాటించి నిర్భంద హెల్మెట్ దారణ అమలు చెయ్యలని

ప్రజలలో అవగాహన కల్పించాలని ఉత్తర్వులు జారీచేయడం జరిగింది.

అవగాహన కార్యక్రమాలు

నంద్యాల జిల్లా పోలీసు అదికారులు వారి సిబ్బందితోపాటు ట్రాఫిక్ నియంత్రణకు ,రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో పోలీసు అధికారులు

స్కూల్ మరియు కాలేజీలలో,పబ్లిక్ ప్రదేశాలలో ఆటొ స్టాండ్ లవద్ద ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని

బైక్ పై హెల్మెట్ తప్పనిసరి..ఎస్పీ

Also Read నల్లమలకు అడవి దున్న – Adavi Dunna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top