చేతినిండా తాళ్లు కట్టుకుని, జుట్టు , గడ్డం పెంచుకుంటే భక్తులైపోరు
AP గుడివాడ: కొడాలి నాని గడ్డం వాడు చేసే అడ్డమైన పనులు చూడలేక గుడివాడ ప్రజలు ఛీ కొట్టినా ఇంకా బుద్ధి రాలేదని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విరుచుకుపడ్డాడు. 20 ఏళ్లుగా గుడివాడ ప్రజలను పీకుతున్న కొడాలి నాని ఆ దరిద్రం వద్దనుకొని ఎన్నికల్లో ఓడగోట్టారని అయినా ఇంకా ఆ మొహం కనపడదు లే అను కుంటే ఇప్పుడు ఏదో సాకుతో మళ్లీ మీడియా ముందుకు వచ్చి పిచ్చి వాగుడు వాగడం మళ్ళీ గుడివాడకు దరిద్రమైనదే అని , తిరుమల తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని.. దేశ ప్రజలందరూ బాధలో ఉంటే.. కొడాలి నాని మాత్రం తిరుపతి లడ్డుని అపహస్యంగా లెక్కలేనితనంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ..తిరుమల లడ్డూను అపహాస్యం చేసేలా ఆ పార్టీ నేతలు మాట్లాడు తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయత లేని వైకాపా నేతలు మూర్ఖపు మాటలు ఆపకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా వరదల్లో మునిగి గుడివాడ ప్రజలు అష్టకష్టాలూ పడినప్పుడు ఎక్కడి పోయావు కొడాలి నాని అంటూ మండిపడ్డారు. స్వామివారి విషయంలో మాజీ సీఎం జగన్ చేసిన తప్పును ఒప్పుగా మార్చేందుకు మీడియా ముందుకొచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సొళ్ళు మాటలు మాట్లాడితే వెంటపడి తరిమే రోజులు వస్తాయన్నారు.
Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ ప్రభుత్వం నుంచి విముక్తి పొంది ఆనందంగా ఉంటే చూసి తట్టుకోలేని ఆ పార్టీ నేతలు అవకాశం దొరికినప్పుడల్లా ఎన్డీయే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రతపై ప్రజలు బాధలో ఉన్నారు. భక్తుల బాధ దేశంలో ప్రతి ఒక్కరికీ అర్థమైంది. దీనిపై అంతర్జాతీయ మీడియా సైతం స్పందించింది. తప్పు జరిగినప్పుడు సరిదిద్దాలి. కానీ తిరిగి మూర్ఖంగా మాట్లాడకూడదని అన్నారు. నియోజకవర్గ ప్రజలంటే భయపడి గుడివాడ రాకుండా కొడాలి నాని తిరుగుతున్నారని . చేతినిండా తాళ్లు కట్టుకుని, జుట్టు , గడ్డం పెంచుకుంటే భక్తులైపోరని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యి విరిగితే.. బొమ్మ చెయ్యి విరిగితే ఏం అవుతుందని హేళన చేసిన దుర్మార్గు డు ఈ కొడాలి నాని అని అన్నారు. రథం దగ్ధమైతే మరొకటి చేయిస్తామనడం ఏంటని ప్రశ్నించారు. దేవుడిపై భక్తి లేని వారికి హిందూ మతం సనాతన ధర్మం చరిత్రకు ఉండే గొప్పతనం ఏం తెలుస్తుందని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి ని కాపాడేందుకె
తిరుమల లడ్డూ విషయంలో అపచారం చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కాపాడేందుకు గుంటూరు నియోజకవర్గానికి రాని కొడాలి నాని .. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి పిచ్చికూతలు కూస్తున్నారని . మీ హయాంలో తిరుమల అపవిత్రమైందని అన్నారు .11 సీట్లు తెచ్చుకుని అసెంబ్లీకి రాకుండా తిరుగుతున్న జగన్, వైసీపీ నాయకులను ప్రజలు మర్చిపోయారని అన్నారు.