పురుషుల సమస్యలకు..పల్లేరు వైద్యం

For men's problems..Palleru medicine

For men's problems..Palleru medicine

  • పురుషుల సెక్స్ సమస్యలకు, మూత్రరోగాలకు పల్లేరు వైద్యం

పల్లేరు – చిన్నపల్లేరు, పెద్ద పల్లేరు అను రెండురకాలుగా దొరుకుతుంది. ఇంచుమించు ఈ రెండింటి ఔషధగుణాలు సమానమే అయినప్పటికీ . ” వీర్యవృద్ధికర ఔషధాల తయారీలో ఏనుగు పల్లేరును తరచుగా ఉపయోగిస్తారు. ఎండించిన పల్లేరు కాయలు పచారీ కొట్లలో లభ్యమవుతాయి.

పల్లేరు కాయలను శుద్ధిచేసి ఔషధంగా ఉపయోగించుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. పల్లేరు కాయలను పాత్రలో పోసి అవి మునిగేంత వరకు ఆవుపాలు పోసి చిన్న మంటపైన పాలు ఇగిరేవరకు మరిగించి దించి కాయల్ని బాగా ఎండించడమే శుద్ధి.

ఈ కాయలను దంచి పౌడర్ చేసుకుని వాడుకోవాలి. శొంఠి, పల్లేరుకాయల చూర్ణాన్ని ఒక్కొక్క స్పూను వంతున తీసుకొని రెండు గ్లాసుల నీళ్ళలో వేసి..

అరగ్లాసు నీరు మిగిలేలా మరగించి, చల్లార్చి, వడగట్టి అందులో పచారి కొట్లలో దొరికే యవక్షారాన్ని చూర్ణించి అరస్పూను వరకు కలిపి..

ఉదయం, సాయంత్రం తాగుతుంటే మూత్రం ధారాళంగా వస్తుంది. మూత్రపిండాలు, పొత్తికడుపు నొప్పి, నడుము నొప్పి తగ్గి మూత్రాశయరాళ్లు కరిగిపోతాయి.

ఉసిరిక వలుపుచూర్ణం, తిప్పసత్తు, ఏనుగు పల్లేరు కాయల చూర్ణాలను ఒక్కొక్కటి యాభై గ్రాముల వంతున తీసుకొని అన్నింటినీ కలిపి అందులో..

తగినంత 6. పటికబెల్లం పొడి కలిపి ఉదయం, సాయంత్రం ఒకస్పూను పొడిని కప్పు పాలలో కలిపి తీసుకుంటుటుంటే నపుంసకత్వం తొలగిపోతుంది.

వీర్యం చిక్కబడుతుంది. శీఘ్రస్ఖలన సమస్య తగ్గుతుంది. వీర్య వృద్ధి జరగటంతో పాటు వీర్యకణాల సంఖ్య పెరిగి సంతానావకాశాలు మెరుగవుతాయి. స్త్రీలలో కలిగే తెల్లబట్టవ్యాధి తగ్గుతుంది

కాళ్ళు, చేతులు, కళ్ళ మంటలు, అత్యష్టం తగ్గుతుంది. వ్యాధి నిరోధకశక్తి పెరుగు తుంది.

ప్రయోగశాలలో జరిగిన అధ్యయనాలలో దీని ఫలంలో స్థిరతైలం, సుగంధిత తైలం, నైట్రేటులు, టానిక్లు ఉన్నట్లు గుర్తించారు.

Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక

రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూను పల్లేరు కాయల చూర్ణం, ఒక చెంచా ధనియాల చూర్ణాన్ని కలిపి కప్పు కషాయం మిగిలేలా..

మరిగించి దించి చల్లార్చి వడగట్టి ఉదయం, సాయంత్రం అర కప్పు కషాయాన్ని తగినంత పంచదార కలిపి తీసుకుంటే మూత్రం జారీగా అవటంతోపాటు రక్తపోటు నియంత్రణ జరిగి తలనొప్పి, తల తిరగటం వంటి పైత్య వికారాలు తగ్గుతాయి.

ఒంట్లోని దుష్టజలం మూత్రం ద్వారా వెడలి శరీరం తేలిగ్గా అవుతుంది. శుంఠపొడికి రెట్టింపు పల్లేరుకాయల పొడి కలిపి రెండు గ్లాసుల నీళ్ళలో..

రెండు స్పూన్ల పొడివేసి ఒకగ్లాసు నీరు మిగులునట్లు కషాయం కాచి వడగట్టి వుంచుకొని ఉదయం, సాయంత్రం అరగ్లాసు కషాయం..

చొప్పున సేవిస్తుంటే నడుమునొప్పి, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు తగ్గుతాయి.
రెండు చెంచాల

ఏనుగు పల్లేరు కాయల చూర్ణాన్ని రెండు గ్లాసుల నీటిలో వేసి అరగ్లాసు నీరు మిగిలేలా మరగించి, చల్లార్చి, వడగట్టి పంచదార కలిపి ఉదయం,

సంభోగశక్తి వృద్ధి

సాయంత్రం తాగుతుంటే బహిష్టుదోషం తొలగి రుతుక్రమం సజావుగా జరుగుతుంది. ఏనుగు పల్లేరు కాయల చూర్ణం, తుమ్మకాయలు,తుమ్మజిగురు, తుమ్మ ఆకుల చూర్ణం సమంగా కలిపి ఒక స్పూను వంతున రోజూ ఒకటి, రెండుసార్లు పాలతో సేవిస్తుంటే వీర్యం చిక్కబడటంతో పాటు శీఘ్రస్కలనం తగ్గి సంభోగశక్తి వృద్ధి అవుతుంది.

Plz Instalationhttps://play.google.com/store/apps/details?id=com.ravindra.news&pli=1

పల్లేరుపై జరిగిన పరిశోధనల్లో ఈ మొక్కకి మూత్రాన్ని జారీ చేసే గుణం ఉన్నట్లు కనుగొన్నారు.
గోక్షురాది గుగ్గులు,

దశ మూలక్వాథ చూర్ణం, గోక్షురాది చూర్ణం మొదలగు * ఆయుర్వేదౌషధాల తయారీలో కూడా పల్లేరును ఎక్కువగా ఉపయోగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top