భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – తెలంగాణా
ఎస్పీ కార్యాలయం
24.05.2025
భారీగా నిషేదిత గంజాయిని పట్టుకున్న జిల్లా పోలీసులు
వాహన తనిఖీలలో మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల విలువ చేసే నిషేదిత గంజాయిని స్వాదీనం చేసుకున్న పోలీసులు
ఈ రోజు అనగా 24.05.2025 ఉదయం 11:30 గంటలకు విశ్వసనీయ సమాచారం మేరకు టేకులపల్లి పోలీసులు మరియు సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలంపాడు X రోడ్ సమీపంలో గల A.C.A సులానగర్ మినిస్ట్రీ చర్చ్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో ఎస్కార్ట్ గా వస్తున్న కారు నెంబర్ HR05BK6032 మరియు HR63E7315 అను నంబరు గల ఐచర్ వ్యాన్ ను ఆపి తనిఖీ చేయగా 698 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయిని గుర్తించడం జరిగింది.సుమారుగా 3,49,00,000/- రూపాయల విలువ గల ఇట్టి గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకోవడమైనది. ఐచర్ వ్యానులో ఉన్న ముగ్గురు వ్యక్తులను కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరిగింది.
ఇట్టి నిషేధిత గంజాయిని అమ్మిన వ్యక్తులపైన,కొనుగోలు చేసిన వ్యక్తులు మరియు రవాణా చేస్తున్న వ్యక్తులందరిపై కేసు నమోదు చేసి అట్టి రవాణాకు ఉపయోగించిన ఐచర్ మరియు కారు ను మరియు 5 మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీలేరు అటవీ ప్రాంతం నుండి హర్యానా రాష్ట్రం,కురుక్షేత్ర ప్రాంతానికి అక్రమంగా ఇట్టి గంజాయిని రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది.పట్టుబడిన నిందితులందరూ కురుక్షేత్ర జిల్లాకు చెందిన ప్రిన్స్ కుమార్ ఆదేశాలతో పార్సిల్ సర్వీస్ మాటున ఇట్టి గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డారు.

పట్టుబడిన ఆరుగురు వ్యక్తుల వివరాలు
- A1). సందీప్ కుమార్ @ రింకు S/o.బల్వీర్ సింగ్, 35 yrs, కశ్యప్, Driver R/o.జెగ్నకేర,కురుక్క్షేత్ర జిల్లా,హర్యానా రాష్ట్రం.
- A2). లక్విందర్ S/o పప్పు, 21 yrs, చిర్నర్ (హరిజన్), వృతి : ఐచెర్ క్లీనర్, R/o సప్లి గాడి (v), కౌతాన్ జిల్లా , హర్యానా రాష్ట్రం.
- A3).అమర్ నాధ్ కుమార్ @ అమర్ నాధ్ S/o సంశేరు సింగ్,26 yrs,వృత్తి: ఎలక్ట్రీషియన్ R/o.కురుక్షేత్ర జిల్లా,హర్యానా రాష్ట్రం.
- A4).పవన్ కుమార్ S/o అశోక్ కుమార్, 34 yrs, శర్మ, వృతి: Car Driver R/o పానిపట్ జిల్లా, హర్యానా రాష్ట్రం.
- A5).రాజ్ కుమార్ @ వినోద్ S/o దిల్ రామ్, 33 yrs,రాడ్ బెండింగ్ వర్కర్,R/o.జోగ్నకేర,కురుక్క్షేత్ర జిల్లా, హర్యానా రాష్ట్రం.
- A6). కృషన్ కుమార్ @ కాలే S/o.జిలే సింగ్, 35 yrs,వృత్తి: Car Driver R/o.గోహన,సోనిపత్ జిల్లా, హర్యానా రాష్ట్రం.
అమ్మిన వ్యక్తి వివరాలు
- A7) హరి ఖారా
- A8) ప్రిన్స్ కుమార్ R/o హర్యానా రాష్ట్రం ( Receiver)
ఈ రోజు పట్టుబడిన ఆరుగురు వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరిగినది.నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న టేకులపల్లి సిఐ టి.సురేష్,ఎస్సై A.రాజేందర్,సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఎస్సైలు ప్రవీణ్,రామారావు మరియు సిబ్బందిని ఎస్పి రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.