నకిలీ పత్తి విత్తనాల కలకలం
పవన్ ఫర్టిలైజర్ షాపు యజమాని నిలదీసి ద్వజమెత్తిన రైతులు.
మెట్టుపల్లె, ఉప్పల పాడు, గ్రామాల్లో నకిలీ పత్తి విత్త నాలతో తీవ్రంగా నష్ట పోయిన రైతులు.
నష్ట పరరి హారం చెల్లించాలని రైతుల డిమాండ్ ..
లేదంటే ఫర్టి లైజర్ అండ్ సీడ్స్ షాపుల ముందు ధర్నా చేస్తామని రైతుల హెచ్చరిక
AP నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం రేకెత్తి స్తున్నాయి, స్థానికం గా ఉన్న పవన్ ఫర్టిలైజర్ అండ్ సీడ్స్ షాపు లో..
పత్తి విత్తనాలు కొనుగోలు చేసి ఎకరానికి లక్ష రూపాయలు మేరకు ఖర్చు చేసి తమ పొలాల్లో సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్ట పోయి నట్టేట మునిగారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మెట్ట పొలాల్లో సాగు చేసేందుకు వీలుగా గత ఆగస్టు మాసంలో బనగానపల్లె లోని పవన్ ఫర్టి లైజర్ అండ్ సీడ్స్ షాపు లో ,
గంగా కావేరి , అంకూర్ , కంపెనీ లకు చెందిన రెండు కిలోల పత్తి విత్తనాల ప్యాకెట్ ను సుమారు వేయ్యి రూపాయల కు కొనుగోలు చేసి పొలాల్లో సాగు చేశారు.
రైతులు పత్తి పంట సాగు చేసిన నాటి నుండి ఆరుకాలం కష్టపడి పంట చేతి కి వస్తుందని ఆశపడిన రైతులకు కన్నీరును మిగిల్చింది.
సుమారు ఆరడుగులు ఎత్తు మేరకు పెరిగిన పత్తి పైరు, విపరీత మైన పూత ,కాయ వచ్చినట్లు వచ్చి పక్వానికి రాక ముందే రాలి పోతుండ డంతో..
రైతుల్లో ఆందోళన, రేకెత్తించింది. దీంతో నకిలీ విత్తనాలు సాగు చేసి నష్టపో యామని , గ్రహించిన రైతులు అప్రమత్తమై ,
విత్తనాలు విక్రయించిన పవన్ ఫర్టిలైజర్ , షాప్ యజమాని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రైతుల సమస్య పై ఏ మాత్రం పట్టించు కోకుండా..
నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో పాటు, నకిలీ విత్తనాల విషయాన్ని గంగా కావేరి , అంకూర్ , కంపెనీలపై నెట్టేసి , చేతులు దులుపు కోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
మెట్టు పల్లె, ఉప్పల పాడు, గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాల కారణం గా సుమారు 20 ఎకరాల్లో తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులు పవన్ ఫెర్టి లైజర్ షాపు ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బాదిత రైతులు మీడియాతో మాట్లాడుతూ .. నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించి లక్షలాది రూపాయలు అక్రమార్జన చేస్తూ.. జేబులు నింపుకుంటున్నా రని ఆరోపించారు.
స్థానికంగా ఉన్న సీడ్స్ , పురుగుల మందులు ఫర్టి లైజర్స్ వ్యాపారులు వ్యవసాయ అధికారు లతో కుమ్మక్కై , ముడుపులు దిగమింగుతూ నకిలీ విత్తనాల దందాను కొనసాగి స్తున్నారని తీవ్రంగా విమర్శించారు. నష్ట పోయిన పత్తి పంట రైతులకు నష్ట పరిహారం చెల్లించక పోతే ఫర్టిలైజర్ షాప్ ముందు ధర్నా చేస్తామని రైతులు పేర్కొన్నారు.