Ex Minister ఉషశ్రీ చరణ్ పై..టిడిపి నాయకుల ఆగ్రహం

ExMinister UshasreeCharan.. TDP leaders'anger

ExMinister UshasreeCharan.. TDP leaders'anger

కదిరి నియోజకవర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్ ;

NDA కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచిని ఓర్వలేక మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్గాలాడుతు న్నారని కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి కదిరి నియోజకవర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్ మండి పడ్డారు

నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీ మతి ఉషశ్రీ చరణ్ గారు మాట్లాడుతూ ” రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయనీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపై సోషియల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి హింసిస్తున్నారని , కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అని, కదిరి నియోజక వర్గంలో అభివృద్ది జరగలేదని, ఎన్నికల హామీలు నెరవేర్చలేదని విమర్శ చేశారు.

దీనికి సమాధానంగా కదిరి నియోజక వర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి “గత అసమర్థ పాలకులు జగన్ మోహన్ రెడ్డి గారు అన్నీ వ్యవస్థలను నాశనం చేసి, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిస్తే,అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతూ ఈ రాష్ట్ర అభివృద్ది కోసం గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు , ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిధులును మంజూరు చేపిస్తూ పల్లె పండుగ పేరుతో 4500 కోట్లతో గ్రామ గ్రామాన రోడ్లు వేపిస్తున్నారు, అంతే కాకుండా ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వృద్దులకు 7000₹ రూపాయల పించన్ , దీపావళికి దీపం 2.0 పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ , భవన నిర్మాణం కోసం ఉచిత ఇసుక పాలసీ విధానం , పారదర్శకంగా మద్యం పాలసీ విధానం , నిరుద్యోగులకు మెగా DSC నోటిఫికేషన్ , రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన కోసం కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అంటూ హర్శిస్తున్నారు.

also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్

రాష్ట్రంలో ఎవరైతే అసాంఘిక చర్యలకు పాల్పడుతూ మహిళలపై , చిన్నారులపై అఘాయిత్యాలకు పూనుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులపై, ఆఖరికి వైఎస్ విజయమ్మ , షర్మిల గారీపై సోషయల్ మీడియాలో సైతం మహిళలపై అతి నీచాతి నీచంగా పోస్ట్లు పెడుతూ ,అవాస్తవాలని ప్రచారం చేస్తున్న సైకోలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది.

NDA కూటమి శాసన సభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్

కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పేద ప్రజల భూములను దొంగ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటుంటే దాని గురించి మాట్లాడకుండా NDA కూటమి శాసన సభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు కదిరి ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యలేదు అని అవాస్తవాలు చెప్తున్నారు.మీకు తెలియకపోతే మీ చుట్టూ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను అడగండి ” కదిరి నుంచి రాయచోటి ప్రాంతానికి వేస్తున్న ప్రధాన రహదారి గురించి , హంద్రనీవా ద్వారా తలుపుల మండలం , N.P. కుంట మండలాలకి నీరు అందించిన ఘనత ఎవరికైనా దక్కింది అంటే అది కందికుంట ప్రసాద్ గారికే చెల్లింది. ఇప్పటికే గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కందికుంట ప్రసాద్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వ భూములను కాజేసిన వారిని, వదిలే ప్రసక్తే లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.

రాష్ట్ర అభివృద్ది కోసం కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడుగారిని , పవన్ కళ్యాణ్ గారిని , NDA కూటమి నాయకులను విమర్శిస్తే చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదు.మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను పిచ్చొడుగా చిత్రీకరించి అతని మరణానికి కారణం అయ్యాడు , మీ పార్టీ MLC అనంత బాబు దళిత డ్రైవర్ ను చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఏం అయ్యారు..? కల్యాణ దుర్గంలో మీ సొంత పార్టీ నేతలే నీకు టికెట్ ఇవ్వద్దు అనే స్థాయికి చేరారు అంటే మీ అవినీతి ఏ స్థాయిలో ఉందో ప్రజలకు తెలియంది కాదు.NDA కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే ముందు ఆలోచన చేసుకొని మాట్లాడాలని నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని తెలియజేసుకుంటున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నపరెడ్డి,లక్ష్మణ్,రవికుమార్,అంజిబాబు, గంగరాజు, రాజేంద్ర ప్రసాద్, రమణ,ప్రతాప్, రాజా రమణ,రఘు,నాగరాజు, అరవింద్,గణేష్ నాయక్,కృష్ణకాంత్ , సాయి , కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top