ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండల పరిధిలోని ఐనముక్కల గ్రామ సమీపంలోని కర్నూలు -గుంటూరు రోడ్డు పై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . దీంతో వాహన దారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు పిర్యాదు చేసిన సంబంధిత అధికారుల్లో చలనం రాకపోవడంపై ప్రయాణికులు, సమీప గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . దెబ్బతిన్న రహదారులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టక పోవడంతో వర్షాల సమయంలో గోతుల్లో నీరు నిలిచిపోయి రహదారి మరింత దెబ్బతిని పెద్దపెద్ద గోతులు ఏర్పడి నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . గోతులమయంగా తయారైన రహదారిలో ప్రయాణిస్తున్న ప్రజల ఒళ్లుహూనం అవుతోందని, ఆ రహదారిపై ప్రయాణం అంటేనే హడాలి పోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా రాత్రి సమయాల్లో వాహన దారులు తీవ్ర ఇక్కట్లు పాలవ్వడమే అని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గతుకులమయంగా మారిన రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.