5 ఫైళ్ల పై తొలి సంతకం చేయనున్న CM చంద్రబాబు

FB_IMG_1718247121241.jpg

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న అనంతరం నేరుగా అమరావతికి చేరుకొని. గురువారం నాడు జూన్ 13న చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టమే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.

మొటగా ఐదు ఫైళ్లపై సంతకం చేయనున్నారు. ఇందులో ప్రధానమైనది మెగా డిఎస్సీ ఫైలుపై సంతకం చేస్తారు. అలాగే వైసీపీ సర్కారు తెచ్చిన ల్యాండ్ యాక్ట్ ను రద్దు చేస్తూ రెండో ఫైలుపై సంతకం చేస్తారు. వీటితో పాటు 4వేల రూపాయలకు పింఛన్ పెంపు,అన్న క్యాంటిన్ పునరుద్దీరణ, స్కిల్ సెన్సెక్స్ పై సంతకాలు చేసి పరిపాలన ముద్ర వేయనున్నారు.ఐదు ఫైళ్లపై తొలి సంతకాలు..గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారు ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాల పేరుతో నగదు పంపిణి చేస్తూ వచ్చింది. కాని ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు, ఉద్యోగకల్పనతో పాటు రాష్ట్రాభివృద్దిని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ కల్పించి అధికారం కట్టబెట్టారు. ఇందులో భాగంగానే టీడీపీ తమ మిత్రపక్ష పార్టీలైన జనసేన, బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం 4.41నిమిషాలకు సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు.సీఎం పదవి చేపట్టిన వెంటనే తొలిగా ఐదు సంతకాలు చేస్తారని తెలుస్తోంది. 5ఫైల్స్ పై చంద్రబాబు నాయుడు సంతకం చేయబోయబోతున్నారని సిఎం ఓ వర్గాలు తెలియజేశారు. 1.తొలి సంతకం – మెగా డీఎస్సీ ..!2.రెండో సంతకం – ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.3.మూడో సంతకం – 4వేల రూపాయలకు పింఛన్ పెంపు.⁠4.నాల్గవ సంతకం – అన్న క్యాంటిన్ పునరుద్దీరణ.⁠5.ఐదవ సంతకం – స్కిల్ సెన్సెక్స్అభివృద్ది పథంలో..ప్రజలకు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తమ ప్రభుత్వం పరిపాలన భాద్యతలు స్వీకరించగానే ప్రజలకు అవసరమైన, ఆమోదయోగ్యమైన పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అందుకే గతంలో టీడీపీ పాలనలో చేపట్టిన అన్న క్యాంటిన్ల ప్రారంభంతో పాటు 4 వేల రూపాయల ఫించన్ కూడా అమలు చేయనున్నారని సిఎం ఓ తెలిపింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top