- నంద్యాల జిల్లా ఆత్మకూరు అర్బన్ సీఐ రాముకు సీఎం సత్కారం
- మొంథా తుఫాన్ సమయంలో నిస్వార్థ అంకితభావ సేవలకు సీఎం ప్రశంస.
- ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఐ రాముకు గౌరవ సత్కారం.
- ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్ళు శ్రమించిన సీఐ రాము.
- సిద్దాపురం చెరువు, భవనాసి నది, వడ్ల రామాపురం చెరువు ఉప్పొంగే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడంలో సీఐ రాము కీలకపాత్ర.
- వరద ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థ సేవలతో ప్రజల మనసు గెలుచుకున్న రాము
- ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం, సీఐ రాము గారి అంకితభావం… పోలీస్ వ్యవస్థకు గర్వకారణం. ఇది ఆదర్శనీయం.
అంకితభావంతో పనిచేసే అధికారులను సత్కరించి, వారిని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముందుంటారు. మొంథా తుఫాన్ సమయంలో అసమాన సేవలు అందించిన నంద్యాల జిల్లా ఆత్మకూరు అర్బన్ సీఐ రాము గారి సేవలను ముఖ్యమంత్రి గారే స్వయంగా కొనియాడారు. ఆ గౌరవ సత్కారం, సీఐ రాము గారి కృతజ్ఞతాభావం గురించి ఈ ప్రత్యేక నివేదిక.
నంద్యాల జిల్లా, ఆత్మకూరు అర్బన్ సీఐ రాము గారి నిస్వార్థ సేవలకు అరుదైన గౌరవం దక్కింది. మొంథా తుఫాన్ సమయంలో ఆయన అందించిన అద్భుతమైన సేవలను ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అభినందించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ముఖ్యమంత్రి గారు స్వయంగా సీఐ రాము గారిని శ సత్కరించి, మెమోంటోను అందజేశారు.
సిద్దాపురం చెరువు, భవనాసి నది, వడ్ల రామాపురం చెరువు ఉప్పొంగుతున్న సమయంలో, సీఐ రాము ఒక సైనికుడిలా నిలబడ్డారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయడంలో, వారికి ధైర్యం చెప్పడంలో ఆయన చూపిన అంకితభావం నిజంగా ప్రశంసనీయం,” అంటూ రాము గారి సేవలను గొప్పగా కొనియాడారు. వరద ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, విపత్కర పరిస్థితుల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివి అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం అందుకున్న సీఐ రాము గారు, ఈ గౌరవం తన ఒక్కడికే కాదని, ప్రజల సేవలో నిరంతరం శ్రమించే పోలీస్ వ్యవస్థ మొత్తానికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. ఈ అరుదైన అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, గౌరవంగా నమస్కరించారు. అధికారులు నిజాయితీగా, అంకితభావంతో పనిచేస్తే, తప్పక గుర్తింపు దక్కుతుందని సీఐ రాము గారు నిరూపించారు.
#CM CBN felicitates Atmakur CI Ramu











