TTD నుంచి ప్రక్షాళన మొదలు – సీఎం చంద్రబాబు

Cleansing-from-TTD-started-CM-Chandrababu.jpg

ఇకనుండి కక్ష్య రాజకీయాలు వుండవు ప్రజా పాలన సాగుతుందని సిఎం నారా చంద్రబాబు నాయుడు వాక్యానించారు.

తిరుమలలో శ్రీవారి దర్శించుకున్న తర్వాత సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి మీడియాతో మాట్లాడారు. మా కులదైవం వేంకటేశ్వరుడు, ఆయన దగ్గరే సంకల్పం చేసి కార్యక్రమం మొదలెడుతానని శ్రీవారి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగానన్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించెందుకు వచ్చే సమయంలో బాంబ్ బ్లాస్ట్ జరిగినా నా కులదైవమే నన్ను కాపాడాడని బావోద్వేగానికి లోనయ్యారు . దేవాన్ష్ పుట్టిన రోజు సంభర్భంగా ప్రతి ఏటా తిరుమలలోని అన్నదాన సత్రంలో అన్నదానం చేయించడం అనవాయితీ పెట్టుకున్నామన్నారు. తిరుమల సన్నిధి పవిత్రమైన దివ్యక్షేత్రం.. ఈ క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదని హెచ్చరించారు. తిరుమలలో ఉంటే వైకుంఠంలో ఉన్నంత భావన కలుగుతుందని అన్నారు.

శ్రీవారి ఆశీస్సులు తీసుకొని పరిపాలన సాగించాడని వచ్చానని .. శ్రీవారి సన్నిధిలో రాజకీయం మాట్లాడటం సబబు కాదు అయినా దొంగలే దొంగ దొంగ అంటూ గత ప్రభుత్వంలో వ్యవహరించిన తీరుని మనం కళ్ళారా చూశామని అన్నారు.

శ్రీవారి సన్నిధి నుండి ప్రక్షాళన మొదలు పెడతా.. తప్పు చేసిన వారిని శిక్షించాలి. పరదాలు కట్టే కార్యక్రమాన్ని మానుకోవాలి. ప్రజలపై అపారమైన విశ్వాసం, గౌరవం ఉంది. ఇతర దేశాల నుంచి వచ్చి ఓటు వేసి తమ బాధ్యతను తెలుగు ప్రజలు తీర్చారని అన్నారు . నేను 5 కోట్ల ప్రజా మనిషిని, అందరి వాడిని. వాస్తవాలను చెప్పలేని దుస్థితిని మీడియా ఎదుర్కొంది. కేసులు పెట్టి భయపెట్టే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ఈ ప్రభుత్వంలో ప్రజా పాలన సాగుతుందని. ప్రజలందరికీ న్యాయం చేస్తా.. 5 సంవత్సరాలు జరిగిన నష్టం, 30 ఏళ్లు రాష్ట్రం వెనక్కు వెళ్లింది. ప్రజలు ప్రభుత్వంతో భాగస్వామి కావాలి. పేదరిక నిర్మూలనకు కృషి చేయాలి. తెలంగాణ రాష్ట్రం బాగుండాలి. రాజధాని అమరావతి .. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు చేపట్టాలని కోరుకున్నాన్ని అన్నారు ..

ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమనీ దేశ చరిత్రలో ఇదే మొదటి సారి అని యావత్ ప్రపంచంలోనే ఏపి అగ్రస్థానంలో ఉండాలి కోరుకుంటున్నట్లు తెలిపారు .. సంపద సృష్టించి వచ్చిన సంపద పేదవాడికి ఇచ్చే కార్యక్రమం చేపట్టాలి అని CM హోదాలో చంద్రబాబు తొలిసారిగా మీడియాతో మాట్లాడాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top