చెంచులపై అటవీ అధికారుల ఉక్కు పాదం.
నంద్యాల జిల్లా, ఆత్మకూరు.
- విల్లంబులు, గొడ్డల్లు, కొడవల్లతో.. ఫారెస్ట్ అధికారులపై చెంచుల తిరుగు బాటు
- కొత్తపల్లి మండలం సదరంపెంట గూడెం వద్ద చెంచులకు ఫారెస్ట్ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం
- చెంచులకు సంబంధించిన పొలాలకు వేసుకున్న కంచె తీసేయాలన్న ఫారెస్ట్ అధికారులు.
- అడవి జంతువుల నుంచి రక్షణ కొరకు చెంచుల పొలాలకు కంచె వేసుకోవాలని మంజూరు చేసిన ఐటిడిఏ
- మా పొలాలకు మేము కంచె వేసుకుంటే ఫారెస్ట్ అధికారులు కంచె తీశాలంటున్నారు ఇదెక్కటి చోద్యం అంటున్న చెంచు గిరిజనులు…
- పొలాలకు ఉన్న కంచెను తీయాలని వచ్చిన ఫారెస్ట్ అధికారులతో వాగ్వివాదానికి దిగి వెనక్కి పంపిన చెంచులు..
ఆదిమ జాతి మూల పురుషులైన చెంచు గిరిజనులపై అటవీ శాఖ ఉక్కు పాదం మోపుతుంది. 2004 అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూ చెంచుల జీవనాధారమైన పంట పొలాలను లాక్కోనేందుకు అటవీ శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.
ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం చదరం పెంటలో.. సుమారు 100 కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి.
అయితే దట్టమైన అడవిలో చెంచులకు ఉండే హక్కు లేదని అటవీ శాఖకు సంబంధించిన భూముల్లో వ్యవసాయం చేయరాదని అటవీ అధికారులు హుకుం జారీ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత కు దారి తీసింది.
బుధవారం నాడు కొత్తపల్లి మండలం, సదరంపెంట చెంచు గూడెం వద్ద చెంచులకు ఆటవీ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
చెంచులకు సంబంధించిన వ్యవసాయ పొలాలకు వేసుకున్న కంచె తీసి వేయాలని చెంచులపై ఫారెస్ట్ అధికారులు ఒత్తిడి చేయగా చెంచులు తిరగబడ్డారు.
అడవి జంతువుల నుంచి రక్షణ కొరకు పొలాలకు కంచె వేసుకోవాలని ఐటిడిఏ సామాగ్రి మంజూరు చేయగా.. చెంచులు కంచె వేసుకున్నారు.
ఐటీడీఏ, అటవీ శాఖ అధికారుల సమన్వయ లోపం కారణంగా ఈ వివాదం తలెత్తింది.
మా పొలాలకు మేము కంచె వేసుకుంటే ఫారెస్ట్ అధికారులు కంచె తొలగించాలనడం బాధాకరమంటూ చెంచు గిరిజనులు వా పోతున్నారు.
పొలాలకు ఉన్న కంచెను తీయాలని వచ్చిన ఫారెస్ట్ అధికారులతో చెంచులు విల్లంబులతో వాగ్వివాదానికి దిగి అధికారులను వెనక్కు పంపారు.
#SadarampentaChenchuGudem