తేయాకులో రసాయనాలు

Chemicals in tea

Chemicals in tea

తేయాకులోని రసాయనాలు

తేయాకులో దాదాపు 600 సువాసన కల్గించే పదార్థాలుంటాయి. పోలీఫీనాల్స్ తేయాకులోని ఆల్కలాయిడ్ ‘కెఫీన్’ ఉత్పత్తికి తోడ్పడుతుంది. లేత తేయాకుల్లో (2 మొగ్గలు ఒక ఆకు) కెఫీన్, పోలీఫీనాల్స్ అధికంగా ఉంటాయి. టానిన్లు (ఫ్లవనాయిడ్స్) తేయాకు ఆరోగ్య గుణాలకు కారణం (యాంటీ ఆక్సిడెంట్లు). తేయాకులోని ఆవిరయ్యే పదార్థాలు దాని రుచి, వాసనలకు కారణం.

సాధారణంగా ‘చాయ్’లో ఒక కప్పులో 40 మిల్లీ గ్రాముల కెఫీన్ ఉంటుంది. అదే కాఫీలోనైతే 120 మి.గ్రా. కెఫీన్ ఉంటుంది. గ్రీన్ టీలో 25 మి.గ్రా.. తెల్లటీలో 15 మి.గ్రా., నల్ల టీలో 40మి.గ్రా. కెఫీన్ ఉంటుంది. హెర్బల్ తేనీరులో ఒక స్పూనుకి కెఫీన్ ఉండదు. కెఫీన్ ఒక ఉత్తేజక పదార్థం. త్రాగిన 5 నిముషాల్లోనే మెదడును చేరుతుంది.

త్రాగిన తరువాత 2-5 గంటల్లో దాని ప్రభావం మాయమౌతుంది. తేనీరు మెదడును ఉత్తేజపరుస్తుంది. దానిలో కెఫీన్ నిదానంగా 10 గంటల వరకు విడుదల చేయబడుతుంది. తేయాకులోని కెఫీన్ పరిమాణం నేల స్వభావం, వంగడం, ఉష్ణోగ్రత మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక తోట నుండి మరొక తోటకు ఆకుల నాణ్యత మారుతుందని ప్రయోగాల ద్వారా నిరూపించారు.

కాఫీలో కంటే తేయాకులో తక్కువ కెఫీన్ ఉంటుంది. ఎండబెట్టిన నల్లతేయాకులో గాలిక్ ఆమ్లమనే ఫీనోలిక్ ఆసిడ్, థియోగాలిన్ (4%) నీటిలో కరిగే రసాయనాలు ఉంటాయి. టీలో మచ్చాటీ పెప్పర్మింట్ టీ, జాస్మిన్ టీ, బబుల్ టీ, ఐస్ట్ టీ, ఇరానీ టీ, కాశ్మీరి పింక్ టీ, లెమన్ టీ, జింజర్ టీ, మసాలా టీ, కడక్ టీ లాంటి అనేక రకాలున్నాయి.

కాఫీ ఉత్పత్తి

ప్రపంచంలో అధిక సంఖ్యలో సేవించబడే వేడి పానీయాల్లో కాఫీ ముఖ్యమైనది. ప్రపంచంలో పండించబడే 40% కాఫీ బ్రెజిల్ దేశం పండిస్తోంది. వియత్నాం 20 శాతం కాఫీ పండిస్తుంది. 2014లో బ్రెజిల్ 2 మిలియన్ హెక్టార్లు హరిత కాఫీ ఉత్పత్తికి కేటాయిచింది.

కాఫీ వినియోగంలో బ్రెజిల్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, కెనడా, స్వీడన్ దేశాలు అగ్రగాములుగా నిలిచాయి. అనేక రకాల కాఫీ గింజలతో వేడి కాఫీ, శీతల కాఫీలు తయారు చేయబడతాయి. వీటిని ఎస్ప్రెస్సో, కెపుక్సినో, అమెరికానో, మోఖా, మఖేత్ లాంటి వివిధ రూపాల్లో సేవిస్తారు ప్రజలు.

Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక

కాఫీలో ప్రధానంగా అరబికా, రోబస్టా అనే రెండు రకాలున్నాయి. కాఫీ త్రాగడం వలన శక్తి వస్తుంది, గుండెకు మంచిదని, లివర్ కేన్సర్ నుండి రక్షిస్తుందని, పార్కిన్సన్స్ వ్యాధి నుండి కాపాడుతుందని, ఆరోగ్యపరమైన లాభాలున్నాయని ప్రజల నమ్మకం.

2020లో 175 మిలియను కాఫీ సంచులు (60 కిలోలు) ప్రపంచంలో ఉత్పత్తి చేయబడ్డాయి. దక్షిణ అమెరికా మాత్రమే 2022లో 82 మిలియను సంచులు ఉత్పత్తి చేసింది. కాఫీ వాణిజ్యం ద్వారా ఉత్తర అమెరికా 85 బిలియను అమెరికా డాలర్లు ఆర్జించింది.

భారతదేశం కాఫీ ఉత్పత్తిలో 6వ స్థానం

బ్రెజిల్ 35 బిలియను డాలర్లు ఆర్జించింది. 2022లో కాఫీ దిగుమతులు 136 మిలియను సంచులు (60 కిలోలు గా ఉండి, ఎగుమతులు 140 మిలియను సంచులుగా నమోదైంది. 2023లో అమెరికా దిగుమతిలో అగ్రగామిగా నిలిచి, తరువాత క్రమంలో జర్మనీ, కెనడా, నెదర్లాండ్స్ దేశాలున్నాయి. 2023లో కాఫీ ఎగుమతిలో బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీలు ముందు వరుసలో ఉన్నాయి.

కాఫీ ఒక ఫెయిర్ ట్రేడ్ ఉత్పత్తిలా నిలిచింది. కాఫీ ఉత్పత్తిలో ‘అరాబికా’ రకం కాఫీ ప్రధానమైనది (97 మిలియను 60 కిలోల సంచులు) రెండో వరుసలో ‘రొబస్టా’ రకం 74.1 మిలియను 60 కిలో సంచులు ఉత్పత్తి చేయబడింది. ఉత్తర అమెరికా 8.2 బిలియను డాలర్ల విలువైన కాఫీ దిగుమతి చేసుకుంటుంది. బ్రెజిల్ 7.35 బిలియను డాలర్ల విలువైన కాఫీ ఎగుమతి చేస్తోంది.

భారతదేశంలో ప్రధానంగా కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాఫీ పండించబడుతోంది. క్రొత్తగా ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, అస్సాం, మణిపూర్ పండిస్తున్నాయి. 2023లో కేవలం కర్నాటక 70% కాఫీ ఉత్పత్తి చేసింది. భారతదేశం కాఫీ ఉత్పత్తిలో 6వ స్థానంలో ఉంది.

బ్రెజిల్, వియత్నాం, కొలంబియా, ఇండోనేషియా, ఇథియోపియా, హొందురాస్ తరువాత. కర్నాటక 71%, కేరళ 21%, తమిళనాడు 5% కాఫీ ఉత్పత్తి చేస్తుంది. కాఫీ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ‘కాఫీ బోర్డు’ను నెలకొల్పింది బెంగుళూరులో, కాఫీ చరిత్రలో 4 యుగాలున్నాయి ఆర్థికపరంగా, 1500-1700 కాలాన్ని మొదటియుగంగా పిలుస్తారు.

Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV

ఈ కాలంలో కాఫీ ఉత్పత్తి అరేబియా ముఖ్యంగా ప్రస్తుత యమన్ దేశానికి పరిమితమై యుండేది. అదేతరుణంలో తూర్పు ఆఫ్రికాలో.. కాఫీ తోటలు ఎత్తైన కొండ ప్రాంతాల్లోని అడవుల్లో ప్రాకృతికంగా పెరిగేవి. కాఫీ వాణిజ్యం అప్పటి ఓటోమన్ రాజ్యం గుప్పిట్లో ఉండేది గుత్తాధిపత్యంగా.

ఆ తరువాత యూరోపియా వాణిజ్య కంపెనీలు కాఫీ ఉత్పత్తిలో ప్రవేశించిన తరుణంలో ఈ గుత్తాధిపత్యం విచ్చిన్నమైంది. జావా ద్వీపాల్లో డచ్వారు, ఫ్రెంచివారు హైతి ప్రాంతాల్లో కాఫీ తోటలను ప్రోత్సహించారు.వీరు ఈ తోటల పెంపకానికి బానిస కార్మికులను తక్కువ కూలీతో ఉపయోగించి విస్తారంగా తోటలను సాగు చేయడం జరిగింది.

ఆ తరువాత బానిస కార్మికుల వినియోగం నివారించబడింది. బ్రెజిల్ దేశంలో కాఫీ పరిశ్రమ అభివృద్ధి చెంది యూరప్, ఆసియా ఖండాల నుండి కార్మికులను రప్పించి తోటల సాగులో ఉపయోగించారు. అదే తరుణంలో ఉత్తర అమెరికాలో కాఫీకి ఆదరణ విపరీతంగా పెరిగింది.

కాఫీ మొదటి బ్రాండ్లు, మిశ్రమాలు తొలిసారిగా జాతీయ స్థాయిలో ఆమోదించబడినాయి 20వ శతాబ్దంలో కాఫీ పరిశ్రమ ప్రాపంచీకరణ జరిగింది. అనేక దేశాలు స్వాతంత్య్రం పొంది విదేశీమారక ద్రవ్యం ఆర్జించడానికి కాఫీతోటలు పెంచి పశ్చిమ దేశాలకు ఎగుమతి చేసే ఆవశ్యకత ఏర్పడింది.

ఐరోపా దేశాలకు కాఫీ కేఫ్ లు

ఈనాడు ప్రపంచ వాణిజ్యంలో కాఫీ ప్రముఖ పాత్ర సంతరించుకుంది. తొలుత హిందూ మహాసముద్రం, ఎర్ర సముద్ర ప్రాంతాల్లో బానిస కార్మికులనుపయోగించి సాగు చేయబడే కాఫీ తోటలు క్రమేపీ ఇతర దేశాలకు, ప్రాంతాలకు విస్తరించాయి.

కాఫీ ఉత్పత్తి, పరిశ్రమలు బానిసత్వాన్ని పెంచినప్పటికీ నవయుగానికి నాంది పలికింది. కాఫీలో ఉన్న ఒక సుగణమేమంటే అది ఆల్కహాల్తో గూడిన పదార్థం కాదు. అందువలనే మొదటి నుండి కాఫీ ఇస్లామిక్ దేశాల్లో విశేష ఆదరణ పొందింది. ప్రపంచంలో మొదటి కాఫీ కేఫ్ లు ఓటోమన్, అరేబియన్ సామ్రాజ్యాల్లో నెలకొల్పబడినాయి. ఆ తరువాత క్రమేపీ ఐరోపా దేశాలకు కాఫీ కేఫ్ లు విస్తరించాయి.

ప్రజల జీవన విధానాలను, కార్మిక ఉత్పాదకతలను అనూహ్యమైన రీతిలో మార్చి వేశాయి. లండన్ స్టాక్ ఎక్చేంజ్ మరియు లాయడ్స్ లండన్ కాఫీ హౌస్లు సమకాలికంగా ఎదిగాయి. వాణిజ్యవేత్తలు ఈ కాఫీ హౌసెస్ లోనే వ్యాపారం చేయడం పరిపాటి అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top